Google Maps : గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచ‌ర్స్.. ఈ ఆప్ష‌న్ తో మనీ ఆదా.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Google Maps : గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచ‌ర్స్.. ఈ ఆప్ష‌న్ తో మనీ ఆదా..

 Authored By mallesh | The Telugu News | Updated on :7 April 2022,7:30 pm

Google Maps : గూగుల్ మ్యాప్స్ అందుబాటులోకి వచ్చిన తరువాత నేవిగేషన్ అనేది చాలా సింపుల్ ప్రాసెస్‌గా మారిపోయింది. ఈ నేవిగేషన్ సర్వీస్ సహాయంతో కొత్త కొత్త ప్రాంతాలకు ఈజీగా రీచ్ కాగలుగుతున్నాం. గూగుల్ మ్యాప్స్ ఫీచర్ అనేది ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో ఇన్‌బిల్ట్‌గా వస్తోంది. నిరంతరం కొత్త ఫీచర్లతో గూగుల్ అప్‌డేట్ చేస్తూ వస్తోంది. ప్ర‌స్తుతం గూగుల్ మ్యాప్స్‌ లో త్వరలోనే కొత్త ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. యూజర్లు వెళ్లాలనుకుంటున్న లొకేష‌న్స్ కు దారిని చూపడంతో పాటు ఇప్పటికే ఎన్నో ఫీచర్లతో మ్యాప్స్ క‌స్ట‌మ‌ర్ల‌కు సేవలు అందిస్తోంది.గూగుల్ మ్యాప్స్‌ అప్లికేషన్‌లో మల్టిపుల్ లొకేషన్స్ కు సంబంధించిన డైరెక్షన్స్‌ను తెలుసుకునే వీలు కూడా ఉంది. స్కూల్స్, హాస్పిట‌ల్స్, మాల్స్, హోట‌ల్స్ ఇలా మల్టిపుల్ స్టాప్స్ ను యాడ్ చేసుకుంటే లొకేష‌న్ కి సంబంధించి డైరెక్షన్స్ వేరువేరుగా చూపించబడతాయి.

ఈ ఆప్ష‌న్ ఎప్ప‌టినుంచో అందుబాటులో ఉంది.అలాగే గూగుల్ మ్యాప్స్‌లోని మై మ్యాప్స్ ఫీచర్‌ను ఉపయోగించుకోవటం ద్వారా మీ ట్రిప్‌కు సంబంధించిన ప్లాన్ వివరాలను కస్టమ్ మ్యాప్స్ రూపంలో క్రియేట్ చేసుకుని ఫ్రెండ్స్, ఫ్యామిలీతో షేర్ చేసుకునే ఆప్ష‌న్ కూడా ఇదివ‌ర‌కే అందుబాటులో ఉంది.రానున్నరోజుల్లో అప్‌డేట్‌ ద్వారా అందరికీ నూతన ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. మ‌నం చేరుకోవాల‌నుకునే లొకేష‌న్ కి మ‌ధ్య‌లో ఎన్ని టోల్ గేట్స్ ఉన్నాయో, టోల్ ఫీజు ఎంత అవుతుందనే సమాచారాన్ని గూగుల్ మ్యాప్స్ తన కొత్త ఫీచర్లో వాహనదారులకు అందుబాటులోకి తేనుంది. ఒకవేళ టోల్ గేట్లు లేని రూట్ కావాలన్నా దాని ప్రకారం మార్గాన్ని సూచించనుంది. వీటితో పాటు ట్రాఫిక్ సిగ్నల్స్ సదుపాయాన్ని కూడా త్వర‌లో తెస్తోంది.ఎక్కడికి వెళ్లాలో మ్యాప్స్‌లో టైప్ చేసి డైరెక్షన్ బటన్‌పై క్లిక్ చేసిన తర్వాత ఈ ఆప్షన్ కనిపిస్తుంది.

Google Maps New Features

Google Maps New Features

Google Maps : ఎక్క‌డ ఎన్ని ఉన్నాయో తెలుసుకోవ‌చ్చు..

టోల్ చార్జీలను చూపించేందుకు సీ టోల్ పాస్ ప్రైస్…అనే ఆప్షన్‌ను ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ టోల్స్ లేని దారిలో వెళ్లాలనుకున్నా.. ఆ దారులను కూడా గూగుల్ మ్యాప్స్ చూపిస్తుంది. మధ్యలో టోల్ గేట్లు లేకుండా గమ్య స్థానానికి చేరే మార్గం కావాలనుకుంటే అవాయిడ్ టోల్స్ ఫీచర్‌ను ఎంచుకోవాలి. దీంతో మ‌నీ ఆదా అవుతుంది.అవాయిడ్ టోల్స్ ఫీచర్ గతం నుంచే మెనూలో ఉన్నా.. మరింత కచ్చిత్వంతో చేంజ్ టోల్ సెట్టింగ్స్‌లోనూ పొందుపర‌చనుంది. భారత్‌, అమెరికాతో పాటు మరిన్ని దేశాల్లో ఈ ఫీచర్లను గూగుల్ మ్యాప్స్ తీసుకొచ్చింది. నావిగేషన్ మ్యాప్స్‌లో మరింత సమాచారాన్ని కూడా గూగుల్ తీసుకొస్తోంది. ముఖ్యంగా వెళ్లే మార్గంలో ట్రాఫిక్ సిగ్నల్స్‌ను కూడా చూపించే సదుపాయాన్ని ప్రవేశపెడుతోంది. అలాగే కొన్ని ఎంపిక చేసిన నగరాల్లో రోడ్ల విస్తీర్ణాన్ని కూడా తెలియజేయనుంది.

Advertisement
WhatsApp Group Join Now

Also read

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది