Google Pay : సరికొత్త ఫీచర్స్ తో గూగుల్ పే యాప్.. స్మార్ట్ ఫోన్ తో ఎక్కడికైనా వెళ్లేలా సేవలు
Google Pay : ప్రస్తుతం డిజిటల్ పేమెంట్స్ దేశ వ్యాప్తంగా పెరిగాయి. ఎక్కడికెళ్లినా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫోన్ ఒక్కటి క్యారీ చేస్తే చాలు. ఎక్కడైనా ఎప్పుడైనా యూపీఐ ద్వారా ట్రాన్సాక్షన్ చేసేస్తున్నారు. డిజిటల్ పేమెంట్స్ కు కేంద్రం కూడా ప్రోత్సహిస్తూ మరిన్ని సేవలు అందిచడానికి ప్రోత్స హిస్తోంది. దీంతో పోటీ పడుతూ డిజిటల్ పేమెంట్స్ యాప్స్ కొత్త ఫీచర్స్ ను ప్రవేశపెడుతున్నాయి. క్రెడిట్ డెబిట్ కార్డులను కూడా యాడ్ చేసుకుని వాలెట్ ద్వారా యూస్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నాయి.
టెక్ దిగ్గజం గూగుల్ మరిన్ని అప్డేట్స్ తో సేవలు మరింత సులభతరం చేస్తోంది. ఇకపై ఫిజికల్ వాలెట్ లో బోలెడన్ని కార్డ్స్ , డాక్యూమెంట్స్ తీసుకెళ్లాల్సిని పనిలేదు. సింపుల్ గా ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే అన్ని మీ వెంటే ఉండేలా సేవలు అందించడానికి సరికొత్త ఫీచర్ తేనుంది. డిజిటల్ పేమెంట్ యాప్ గూగుల్ పే మరిన్ని ఫీచర్స్ తో వచ్చేస్తోంది. అయితే కొన్ని దేశాల్లో మాత్రమే గూగుల్ వాలెట్ యాప్ తీసుకొస్తుంది.
క్రెడిట్ , డెబిట్ కార్డు, డిజిటల్ ఐడీలు, అలాగే పలు డాక్యుమెంట్స్, ఇతర ఐడీలు, డ్రైవింగ్ లైసెన్స్, ఫ్లైట్ బోర్డింగ్ పాస్ లు గూగుల్ వాలెట్‌లో అక్టివేట్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. దీంతో ఫిజికల్ క్రెడిట్, డెబిట్ కార్డు, ఇతర డాక్యుమెంట్స్ క్యారీ చేయాల్సిన పనిలేదు. ఈ వాలెట్ ద్వారానే అన్ని సేవలు పొందవచ్చు. కాగా ఈ గూగుల్ వాలెట్ కొన్ని దేశాల్లోనే గూగుల్ పే స్థానంలో వస్తుంది. అయితే అమెరికా, సింగపూర్, భారత్ వంటి దేశాల్లో మాత్రం గూగుల్ పే యాప్, వాలెల్ రెండూ అందుబాటులో ఉంటాయి. అలాగే గూగుల్ వాలెట్ కు గూగుల్ మాప్స్ సేవలను కూడా లింక్ చేయనున్నట్లు గూగుల్ ప్రకటించింది.