Google : ఇక యూట్యూబ్ ద్వారా డబ్బులే డబ్బులు.. గుడ్ న్యూస్ చెప్పిన గూగుల్..!!
Google : ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియాలో రకరకాల ప్లాట్ఫామ్స్ ద్వారా డబ్బులు సంపాదించే వాళ్ళు ఎక్కువైపోయారు. ముఖ్యంగా యూట్యూబ్ లో రకరకాల చానల్స్ పెట్టుకొని భారీ ఎత్తున డబ్బులు సంపాదిస్తున్నారు. ఫుడ్, ట్రావెలింగ్, ఎంటర్టైన్మెంట్, టెక్నాలజీ, పొలిటికల్… రకరకాల కంటెంట్ లకి సంబంధించి చానల్స్ ద్వారా భారీ ఎత్తున డబ్బులు సంపాదిస్తున్నారు. ఈ క్రమంలో యూట్యూబ్ సంస్థ… చానల్స్ వాళ్ళని ప్రోత్సహించే రీతిలో షార్ట్ వీడియోస్ ద్వారా కూడా డబ్బులు వచ్చేలా అవకాశాలు గతంలో కల్పించడం తెలిసిందే. ఇదిలా ఉంటే ఇప్పుడు..
షార్ట్ వీడియోస్ మధ్య వీక్షించిన ప్రకటన నుంచి రాబడిని పెంచుకోవడానికి..అనుమతులు ఇచ్చే రీతిలో గూగుల్ కొత్త మానిటైజేషన్ మాడ్యూల్ తీసుకురావడం జరిగింది. ఈ కొత్త మాడ్యూల్ నుంచి ప్రయోజనం పొందాలంటే కంటెంట్ క్రియేటర్లకు తప్పనిసరిగా యూట్యూబ్ భాగస్వామి ప్రోగ్రాం అప్ డేట్ చేయబడిన నియమాలను అనుసరించాలి.. అని కంపెనీ తెలిపింది. దీంతో యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రాం (YPP) నిబంధనలను పునరుద్ధరించినట్లు గూగుల్ ప్రకటించింది. దీంతో షార్ట్ మానిటైజేషన్ మాడ్యూల్ కంటెంట్ క్రియేటర్లకు ప్రకటనల ద్వారా యూట్యూబ్ చిత్రాలలో డబ్బు అర్జించే అవకాశాన్ని
అందించే దిశగా ఫిబ్రవరి 1 నుంచి ఇది అమలులోకి తీసుకురావడం జరిగింది. ఈ విషయంలో ఒప్పందం పై సంతకం చేసిన తర్వాత క్రియేటర్లు ప్రకటనలు ఎంపిక చేసుకోవచ్చు. ఆ తర్వాత ప్రకటనల సంపాదన అవకాశాలను అన్ లాక్ చేయడానికి కాంట్రాక్ట్ మాడ్యుల్ లను సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ YPP నిబంధనలు ఒప్పందంపై అంగీకారం తెలిపిన తరువాతే మానిటైజేషన్ స్టార్ట్ అవుతోంది. YPP వినియోగదారులు సదరు ప్రాథమిక తేదీలోపు అంగీకరించకపోతే… వారి ఛానల్ నుండి తీసివేయపడుతుంది. ఇదే సమయంలో మానిటైజేషన్ ఒప్పందం కూడా రద్దు చేయబడుతుంది.