Google Android App : గూగుల్ సంచలన యాప్ తీసుకొచ్చింది.. ఫోన్‌లో నెట్ లేకున్నావాడొచ్చు..!
ప్రధానాంశాలు:
Google Android App : గూగుల్ సంచలన యాప్ తీసుకొచ్చింది.. ఫోన్‌లో నెట్ లేకున్నావాడొచ్చు..!
Google Android App : ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం గూగుల్ అద్భుతాలు సృష్టిస్తుంది. ఏ యాప్ యూజ్ చేయాలన్నా మనకు నెట తప్పనిసరి. అయితే ఈ క్రేజీ యాప్ ద్వారా మన ఫోన్‌లో ఇంటర్నెట్ లేకున్నా మనం ఏఐ మోడల్స్‌ను ఉపయోగించుకోవచ్చు. కాని ఏఐ ఎడ్జ్ గ్యాలరీ యాప్ ద్వారా మీ ఫోన్‌లో ఇంటర్నెట్ లేకున్నా ఏఐ మోడల్స్‌ను ఉపయోగించుకోవచ్చు.

Google Android App : గూగుల్ సంచలన యాప్ తీసుకొచ్చింది.. ఫోన్‌లో నెట్ లేకున్నావాడొచ్చు..!
Google Android App అద్భుతం…
ఇంటర్నెట్ లేకున్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఇమేజ్‌లను సృష్టించడం , కోడ్ రాయడం, సమాధానాలు రాబట్టడం వంటివి సులభంగా చేయొచ్చు. ఇందులో మరో ప్రధానమైన విషయం ఏమిటంటే.. యూజర్ ప్రైవసీ కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే యూజర్లు అందించే డేటా క్లౌడ్ (Data Cloud) సర్వర్లకు వెళ్లకుండా మొత్తం మొబైల్ ఫోన్లో బ్యాక్ఎండ్‌లో రన్ అవుతుంది. ఇది సెక్యూరిటీ రిస్క్‌ను కూడా తగ్గిస్తుంది
గూగుల్ ఏఐ ఎడ్జ్ గ్యాలరీ యాప్ గెమ్మా 31బీ అనే లాంగ్వేజ్ మోడల్‌పై ఆధారపడి పనిచేస్తుంది. కేవలం 529 ఎంబీ పరిమాణంలో వచ్చే కాంపాక్ట్ మోడల్. అపాచీ 2.0 లైసెన్స్‌తో వస్తోంది. ఇది విద్య, వాణిజ్య అవసరాలకు కూడా వినియోగించుకునేందుకు అనుమతిస్తుంది. ఇది ఒక సెకనుకు 2,585 టోకెన్లను ప్రాసెస్ చేయగలదు. పెద్ద మొత్తంలో టెక్ట్స్‌ను ఇట్టే క్షణాల్లో జనరేట్ చేయగలదు. త్వరలోనే ఈ గూగుల్ ఏఐ ఎడ్జ్ గ్యాలరీ యాప్ ఐఓఎస్ వెర్షన్‌ను కూడా విడుదల చేయనున్నట్లు గూగుల్ ప్రకటించింది.