Gorantla Madhav : లోకేష్ పై గోరంట్ల మాధవ్ అనుచిత వ్యాఖ్యలు…!
ప్రధానాంశాలు:
Gorantla Madhav : లోకేష్ పై గోరంట్ల మాధవ్ అనుచిత వ్యాఖ్యలు...!
Gorantla Madhav : వైసీపీ Ysrcp మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. తాజాగా నారా లోకేష్ పై చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో తాడేపల్లి పోలీస్ స్టేషన్లో మాధవ్పై కేసు నమోదైంది. ఇప్పటికే ఆయనపై అనేక కేసులు నమోదవుతుండగా, పోలీసుల నుండి వరుస నోటీసులు, విచారణలతో మాధవ్ కష్టాల్లో పడ్డారు. ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ అరెస్ట్ విషయంలో పోలీసులతో వాగ్వివాదానికి దిగిన ఆయనను అదుపులోకి తీసుకున్న ఘటన మరింత చర్చనీయాంశమైంది.

Gorantla Madhav : లోకేష్ పై గోరంట్ల మాధవ్ అనుచిత వ్యాఖ్యలు…!
Gorantla Madhav నారా లోకేష్ Nara Lokesh పై గోరంట్ల మాధవ్ అతిదారుణమైన వ్యాఖ్యలు
తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో గోరంట్ల మాధవ్ మంత్రి నారా లోకేష్‌ను తీవ్రంగా విమర్శిస్తూ అక్కా-బావా కానివాడిగా అభివర్ణించడం రాజకీయంగా తీవ్ర దుమారాన్ని రేపింది. జగన్ మోహన్ రెడ్డికి భద్రత కల్పించడంలో లోపాలు ఉన్నాయంటూ, గోరంట్ల మాధవ్ ప్రభుత్వ యంత్రాంగాన్ని ఘాటుగా ప్రశ్నించారు.
“మగవాళ్లకూ బావా కానివాడికి జెడ్ కేటగిరీ భద్రత ఇవ్వగలిగితే, పూర్వ ముఖ్యమంత్రి జగన్ కు ఎందుకు ఇవ్వరు?” అంటూ ఆయన విరుచుకుపడ్డారు. మాధవ్ చేసిన ఈ వ్యాఖ్యలు తలెత్తించిన విమర్శలు నేపథ్యంలో టీడీపీ నాయకుడు జి. నాగేశ్వరరావు తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేశారు.