Leafy Vegetables : ఆకుకూరల్లో ఉండే ఆయుర్వేద గుణాలు తెలిస్తే వెంటనే వండుకొని తినేస్తారు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Leafy Vegetables : ఆకుకూరల్లో ఉండే ఆయుర్వేద గుణాలు తెలిస్తే వెంటనే వండుకొని తినేస్తారు

 Authored By jagadesh | The Telugu News | Updated on :24 May 2021,9:30 am

Leafy Vegetables : ప్రస్తుతం మనం ఎటువంటి సమస్యను ఎదుర్కొంటున్నామో అందరికీ తెలుసు. కరోనా మహమ్మారి మనుషులను పట్టి పీడిస్తోంది. శరీరంలోకి వెళ్లి ఎన్నో ఆరోగ్య సమస్యలను సృష్టిస్తోంది. అసలు.. కరోనా కాదు కదా.. దాన్ని తాత లాంటి వైరస్ వచ్చినా కూడా మన శరీరంలోకి కూడా వెళ్లకుండా మనం నియంత్రించవచ్చు. కాకపోతే దానికి మనం చేయాల్సింది.. శరీరానికి అవసరమైన ఆహారాన్ని తీసుకోవడం. సరైన ఆహారాన్ని, పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకుంటే.. అసలు ఏ వైరస్ కూడా మన దరి చేరదు. మన శరీరంలో కావాల్సినంత రోగ నిరోధక శక్తి ఉంటే.. ఎటువంటి వైరస్ శరీరంపై దాడి చేయలేదు. ఈ విషయం అందరికీ తెలుసు కానీ.. అసలు తినాల్సిన ఫుడ్ కాకుండా చెత్త తినేస్తుంటారు.

green leafy vegetables health benefits telugu

green leafy vegetables health benefits telugu

ముఖ్యంగా ప్రతి రోజూ మనం ఆహారం భాగం చేసుకోవాల్సింది ఆకుకూరలు. అవును.. ఆకుకూరలు.. ఎంత తింటే అంత మంచిది. మనకు దొరికే అన్ని రకాల ఆకు కూరలను తినాల్సిందే. వాటిలో ఎన్నో ఆయుర్వేద గుణాలు ఉంటాయి. ఆకు కూరలను క్రమం తప్పకుండా తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలిస్తే మీరు వెంటనే ఆకుకూరలను వండుకొని తినేస్తారు.

Leafy Vegetables : ఏ ఆకు కూరలో ఎటువంటి గుణాలు ఉన్నాయి

మనకు మార్కెట్ లో చాలా ఆకు కూరలు దొరుకుతాయి. కొన్ని సీజన్లను బట్టి దొరుకుతాయి. కాబట్టి.. ఏ సీజన్ లో దొరికే ఆకు కూరను.. ఆ సీజన్ లో తినేయాలి. సాధారణంగా మనకు అందుబాటులో ఉండే ఆకు కూరలు బచ్చలి కూర, పాల కూర, తోట కూర, గోంగూర, కొత్తిమీర, పూదీన.మరి.. వీటిని తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. బచ్చలికూరను ఎక్కువగా వేసవిలో తీసుకోవాలి. ఎండాకాలంలో ఎంత ఎక్కువగా బబ్చలి కూరను తింటే అంత మంచింది. వేసవిలో శరీరంలో వచ్చే వేడిని బచ్చలి కూర తగ్గిస్తుంది. శరీరాన్ని చల్లబరుస్తుంది. అందుకే బచ్చలికూరను వేసవిలో ఖచ్చితంగా తీసుకోవాలి.ఇక.. అన్ని ఆకుకూరల్లో రారాజు పాలకూర. మనం పప్పు వండుకున్నా.. ఇతర కూరలు వండుకున్నా.. ఖచ్చితంగా పాలకూరను అందులో వేస్తుంటాం. పాలకూరను బబ్జీలుగా కూడా చేసుకొని తింటాం. మనం ఆకుకూరల్లో ఎక్కువగా తినేది పాలకూరనే. పాలకూర వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. శరీరంలో వచ్చే ఎన్నో సమస్యలకు పాలకూర చెక్ పెడుతుంది. కఫం, పిత్తం, వాతాన్ని తగ్గించే గుణం పాలకూరలో ఉంది.

Leafy Vegetables

Leafy Vegetables

ఇక.. మరో ఆకు కూర తోటకూర. తోటకూరలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వాటి వల్ల పలు రకాల క్యాన్సర్ కారకాలు నాశనం అవుతాయి. రోగ నిరోధక శక్తి విపరీతంగా పెరుగుతుంది. తోటకూరలో చాలా పోషకాలు ఉంటాయి. చిన్న చిన్న సమస్యలు ఉన్నవాళ్లు తోటకూరను క్రమం తప్పకుండా తీసుకుంటే.. వెంటనే తగ్గిపోతాయి.గోంగూర గుండెకు ఎంతో మంచిది. గోంగూరలో ఉండే పోషకాలు రక్త హీనతను తగ్గిస్తాయి. కరివేపాకు, కొత్తిమీర, పూదీనాను.. ప్రతిరోజూ ప్రతి కూరలో వేసుకుంటాం. ఎందుకంటే.. వాటిలో ఉండే ఆయుర్వేద గుణాలు అటువంటివి. కరివేపాకు.. కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. షుగర్ వ్యాధిని కంట్రోల్ లో ఉంచేందుకు కూడా కరివేపాకు దోహదపడుతుంది. అలాగే కొత్తిమీర కూడా నిత్యం తింటే.. జీర్ణ సమస్యలు తగ్గడంతో పాటు.. అస్తమా తగ్గుతుంది. ఇక.. రక్తాన్ని శుద్ది చేయాలంటే పూదీనాను తినాల్సిందే. ఎటువంటి జీర్ణ సమస్యలు వచ్చినా.. పూదీనాను తింటే అవి వెంటనే తగ్గిపోతాయి.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది