viral news : వరుడు అరెస్ట్.. వధువు చేసిన పనికి అందరూ ఫిదా
viral news.. కాసేపట్లో పెళ్లి.. అంతలోనే ఆగండి అనే వాయిస్.. వరుడు అరెస్ట్.. వధువు షాక్.. ఇదంతా తెలుగు సినిమాలో జరిగే తంతులా ఉంది కదా.. కానీ ఈ ఘటన రీల్ కాదు.. రియల్. ఇది జరిగింది ఇండియాలో కాదు.. ఈక్వెడార్ దేశంలో.. మరికాసేపట్లో దంపతులు కాబోతున్న తరుణంలో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. పెళ్లిని నిలిపివేసి పెళ్లి కొడుకును అరెస్ట్ చేశారు. అక్కడ ఏం జరుగుతుందో తెలియక పెళ్లి కూతురు షాక్ తింది. ఆ సమయంలో ఆమె చేసిన పనికి అందరూ ఫిదా అయ్యారు. వరుడును తీసుకెళ్తున్న పోలీస్ వాహనం వెనుక పరుగులు పెట్టింది. తన భర్తను వదలివేయమని ప్రాధేయపడింది. పోలీసుల కారు వెంట వధువు పరుగెడుతున్న వీడియా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
viral news : పోలీస్ వాహనం వెంట వధువు పరుగులు..
అయితే, విషయంలోకి వెళ్తే.. ఈక్వెడార్‌లోని ఎల్ గువాబో క్యాంటన్ నగరానికి చెందిన ప్రేమ జంట ఇరు వర్గాల పెద్దలను ఒప్పించి పెళ్లికి సిద్ధమయ్యారు. పెద్దలు ఒప్పుకోవడంతో నగరంలోని ఓ చర్చిలో పెళ్లి ఏర్పాట్లు చేశారు. మరి కాసేపట్లో వరుడు వధువుకు రింగ్ తొడుగుతుండగా పోలీసులు అక్కడికి వచ్చి వివాహాన్ని నిలిపివేశారు. పెళ్లి కొడుకును అరెస్ట్ చేశారు. హఠాత్తుగా జరిగిన ఘటనను చూసి వధువు షాక్‌కు గురైంది. పోలీసు వాహనం వద్దకు పరుగెత్తి తన భర్తను వదిలిపెట్టాలని ప్రాధేయపడింది. ఆ వాహనం వెంటే ఆమె పరుగులు పెట్టింది. కానీ పోలీసులు మాత్రం ఆమె మొర ఆలకించలేదు.
పోలీసులు వరుడుని అరెస్ట్ చేయడం వెనుక కారణముంది. అతినికి ఇంతకుముందే పెళ్లయింది. కానీ, వారిద్దరూ అభిప్రాయ భేదాలతో విడాకులు తీసుకున్నారు. విడాకుల ఒప్పందం ప్రకారం.. మొదటి భార్యకు చెల్లించాల్సిన భరణాన్ని అతను ఇవ్వలేదు. దీంతో మాజీ భర్తపై ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతడు మరో వివాహం చేసుకుంటాడని తెలుసుకున్న పోలీసులు.. నేరుగా చర్చికి వెళ్లి.. పెళ్లి కొడుకును అరెస్ట్ చేశారు. వధువు పోలీస్ వాహనం వెంట పరుగెత్తిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలైంది. భర్త అంటే ఎంత ప్రేమో కాదని కొందరు కామెంట్ చేస్తుండగా.. మరికొందరు వరుడు తీరును తప్పబడుతున్నారు.