Beard : గడ్డం పెంచుకుంటే ఇన్ని లాభాలా? ఈ విషయం తెలిస్తే మీరు కూడా గడ్డం పెంచుకుంటారు?
Beard : గడ్డం.. మగవాళ్లకు అందం అదే. గడ్డం పెంచుకున్న మగవాళ్లనే మహిళలు కూడా ఇష్టపడుతుంటారు. కానీ.. చాలామంది మగవాళ్లకు గడ్డం నచ్చదు. క్లీన్ షేవ్ చేసుకుంటారు. మీసాలు కూడా తీసేస్తారు కొందరు. ముఖ్యంగా ఉద్యోగాలు చేసేవాళ్లు.. క్లీన్ షేవ్ చేసుకొని ఆఫీసులకు వెళ్తుంటారు. వాళ్లు అస్సలు గడ్డం పెంచుకోరు. కొందరు గడ్డం విపరీతంగా పెంచుతారు. అయితే.. యూత్ ఎక్కువగా సినిమా సెలబ్రిటీలను ఫాలో అవుతుంటారు. సినిమా హీరోలు గడ్డం పెంచితే వీళ్లు పెంచుతారు. సినిమా హీరోలు క్లీన్ షేవ్ చేస్తే వీళ్లు కూడా చేస్తారు. యూత్ ట్రెండ్ ను బట్టి మారుతుంటారు.
గడ్డం పెంచడం అనేది కొందరికి పాషన్. అమ్మాయిలను ఇంప్రెస్ చేయడం కోసమో.. మరే దేనికో గడ్డాన్ని పెంచే వాళ్లు చాలామంది ఉంటారు. అయితే గడ్డం పెంచడం వల్ల లాభాలు ఉంటాయని చాలామందికి తెలియదు. గడ్డం పెంచడం వల్ల ఏదో అమ్మాయిలకు నచ్చడం కాదు.. దాని వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Beard : గడ్డం పెంచి ఈ సమస్యలకు చెక్ పెట్టండి
గడ్డం పెంచడం వల్ల చర్మ వ్యాధులు తగ్గుతాయట. చాలామందికి చర్మ వ్యాధులు వస్తుంటాయి. అయితే.. గడ్డం పెంచితే.. సూర్యడి నుంచి వచ్చే రేడియేషన్ ముఖం మీద నేరుగా పడదు. గడ్డం ఉండటం వల్ల.. గడ్డం మీద పడుతుంది. దీంతో చర్మ సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
క్లీన్ షేవ్ చేసుకుంటే.. చర్మం గట్టిగా మారుతుంది. మాయిశ్చరైజేషన్ కోల్పోతుంది. దాని వల్ల ముఖం మీద బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. దాని వల్ల మొటిమలు వస్తాయి. అదే గడ్డం ఉండే అలాంటి సమస్యలు రావు. ముఖంపై మచ్చలు రాకుండా నివారించవచ్చు.
గడ్డం ఉండటం వల్ల.. సూర్యుడి నుంచి వచ్చే రేడియేషన్, యూవీ కిరణాలను అడ్డుకోవచ్చు. చర్మం మీద డైరెక్ట్ గా సూర్యుడి కిరణాలు పడవు కాబట్టి.. యూవీ కిరణాల వల్ల.. చర్మ క్యాన్సర్ రాకుండా అడ్డుకోవచ్చు. గొంతు ఇన్ఫెక్షన్ లాంటి సమస్యలకు చెక్ పెట్టాలంటే.. గడ్డాన్ని పెంచుకోవాల్సిందే. గడ్డం ఉంటే.. శరీరం కూడా వేడిగా తయారవుతుందట. ముఖ్యంగా చలికాలంలో గడ్డం పెంచుకుంటే.. శరీరాన్ని గడ్డం వెచ్చగా ఉంచుతుందట. చూశారు కదా.. గడ్డం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో. ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే గడ్డం పెంచుకోండి.. దేవదాసులుగా మారండి.