Gutti Vankaya : కొబ్బరి, పల్లీలు, నువ్వులు తినని వారికోసం ఈ స్టైల్ లో గుత్తి వంకాయ మసాలా కర్రీ….
Gutti Vankaya : చాలామందికి వంకాయ పేరు చెప్తేనే నోట్లో నీళ్లు ఊరుతుంటాయి. అంతగా ఇష్టపడుతూ ఉంటారు. దాని రుచి కూడా అంతే లెవెల్ లో ఉంటుంది. అయితే ఈ గుత్తి వంకాయ కూర లో చాలామంది మసాలాలు పల్లీ, కొబ్బరి, నువ్వులు వేస్తే తినరు.. ఇప్పుడు అవన్నీ లేకుండా గుత్తి వంకాయ కూర ఎంతో రుచిగా ట్రై చేద్దాం…గుత్తి వంకాయ మసాలా కర్రీ కోసం కావలసిన పదార్థాలు:వంకాయలు, టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కారం, ఉప్పు, పసుపు, ఎల్లిపాయలు, అల్లం ముక్కలు ఆయిల్ పోపు గింజలు, కరివేపాకు, వాటర్ ధనియా పౌడర్, గరం మసాలా, కొత్తిమీర మొదలైనవి..
దీని తయారీ విధానం:ఒక అరకిలో వంకాయలను తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్ లోకి ఒక కప్పు పెద్ద సైజు ఉల్లిపాయలు, ఒక కప్పు టమాటాలు, 4 పచ్చిమిర్చి నాలుగు ఐదు ఎల్లిపాయలు, నాలుగు ఐదు ముక్కలు అల్లం ముక్కలు వేసి మెత్తని పేస్టులా పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ పై ఒక కడాయి పెట్టుకుని దానిలో నాలుగైదు స్పూన్ల ఆయిల్ వేసి ఈ వంకాయలకు గాట్లు పెట్టుకొని మంచిగా ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇక తర్వాత అదే ఆయిల్లో పోపు దినుసులు కొంచెం కరివేపాకు వేసి అవి వేగిన తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న టమాటా మిశ్రమాన్ని వేసి కలుపుతూ ఉండాలి.
తర్వాత ఒక స్పూన్ గరం మసాలా, రెండు స్పూన్ల ధనియా పౌడర్, రెండు స్పూన్ల కారం వేసి బాగా కలుపుతూ ఉండాలి. ఇక తర్వాత ఫ్రై చేసుకున్న వంకాయలను వేసి ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలి. తర్వాత ఒక రెండు గ్లాసుల వాటర్ పోసి దానిలో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని మూత పెట్టి దగ్గరగా అయ్యేవరకు ఉంచాలి. తర్వాత మూత తీసి కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవడమే అంతే గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ. కొబ్బరి,పల్లీలు, నువ్వులు తినని వారికి ఈ విధంగా చేసుకొని తినవచ్చు.