Hanuman phal | ఈ పండు గురించి మీకు తెలుసా.. ఇది తింటే సమస్యలన్నీ మాయం
Hanuman phal | రోజూ ఆరోగ్యంగా ఉండేందుకు ఆపిల్, అరటి, ద్రాక్ష వంటి పండ్లు తినాలని అందరూ చెబుతారు. కానీ హనుమాన్ పండు సాధారణ పండ్ల కన్నా మరింత అధిక పోషక విలువలు కలిగి ఉండడం ఆశ్చర్యకరం.హనుమాన్ పండు ముఖ్యంగా మెక్సికో, దక్షిణ అమెరికా, ఇతర ఉష్ణమండల ప్రాంతాల్లో పండుతుంది. దీని శాస్త్రీయ నామం అన్నోనా మురికాటా.

#image_title
హనుమాన్ పండు రుచి ఎలా ఉంటుంది?
ఈ పండును తిన్నవారు దీని రుచి గురించి చెబుతారు. ఇది పైనాపిల్ మరియు స్ట్రాబెర్రీ ల మిశ్రమంలా ఉంటుంది. తీపి, కొద్దిగా పుల్లగా ఉండే ఈ పండు తినడానికి ఎంతో రుచికరంగా ఉంటుంది.100 గ్రాముల హనుమాన్ పండులో ఉండే పోషకాలు నీరు – 81 గ్రాములు, శక్తి – 276 KJ, ఫైబర్ – 3.3 గ్రాములు,ప్రోటీన్ – 1 గ్రాము, పొటాషియం – 278 mg, కాల్షియం – 14 mg, మెగ్నీషియం – 21 mg, ఇనుము – 0.6 mg
హనుమాన్ పండుతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు చూస్తే.. యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఫ్రీ రాడికల్స్‌ని తొలగించి, శరీరాన్ని నవోదితం చేస్తుంది. వృద్ధాప్యాన్ని తగ్గించే గుణం కలిగి ఉంటుంది. బ్యాక్టీరియాల వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లను నివారించడంలో సహాయపడుతుంది. ఆర్థరైటిస్, కీళ్ల నొప్పులు, ఇతర వాపు సంబంధిత సమస్యలకు ఉపశమనం.విటమిన్ సి అధికంగా ఉండడం వల్ల శరీర రక్షణ వ్యవస్థ బలోపేతం అవుతుంది. జలుబు, దగ్గు వంటి ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ.కొన్ని పరిశోధనలు ఈ పండు క్యాన్సర్ కణాల పెరుగుదలని నియంత్రించడంలో సహాయపడుతుందని సూచిస్తున్నాయి