Break Fast | ఉదయం అల్పాహారం మానేస్తే ప్రాణహాని!.. హార్వర్డ్ అధ్యయనం హెచ్చరిక
Break Fast | రోజులో తొలి భోజనం బ్రేక్‌ఫాస్ట్ . ఇది సరైన సమయానికి తీసుకోవడం అత్యంత కీలకం. అయితే చాలా మంది ఉద్యోగం, హడావుడి కారణంగా లేదా అలవాటుతో ఉదయం అల్పాహారం మానేస్తుంటారు. ఈ అలవాటు ప్రాణాంతకమని తాజా అధ్యయనం చెబుతోంది. హార్వర్డ్ మెడికల్ స్కూల్ నిపుణులు చేసిన పరిశోధనలో, బ్రేక్‌ఫాస్ట్‌ను స్కిప్ చేయడం లేదా ఆలస్యంగా తినడం అకాల మరణ ప్రమాదాన్ని పెంచుతుంది అని తేలింది.

#image_title
34 ఏళ్ల అధ్యయన ఫలితాలు
ఈ అధ్యయనం కోసం ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్, న్యూకాజిల్‌లలో నివసిస్తున్న 3 వేల మంది పెద్దల ఆరోగ్య డేటా ను పరిశీలించారు. 1983 నుంచి 2017 వరకు 42–94 ఏళ్ల మధ్య వయసు గలవారు ఇందులో పాల్గొన్నారు. వారి భోజన అలవాట్లు, జీవనశైలి, ఆరోగ్య పరిస్థితులను పరిశీలించగా మొదటి, చివరి భోజన సమయాలు ఆలస్యమవుతున్నాయి అని గమనించారు. ఇది శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని తేలింది.
అధ్యయనం ప్రకారం, బ్రేక్‌ఫాస్ట్ ఆలస్యమయ్యే ప్రతి గంటకు మరణ ప్రమాదం 8-11% పెరుగుతుంది . క్రమం తప్పకుండా ఈ అలవాటు కొనసాగితే వృద్ధుల్లో అకాల మరణానికి దారితీస్తుంది. అల్పాహారం ఆలస్యంగా తినడం ఆరోగ్యం వేగంగా క్షీణించడానికి కారణమవుతుంది. దీని వల్ల నిద్ర నాణ్యత తగ్గిపోవడం, అలసట, శారీరక చురుకుదనం తగ్గిపోవడం జరుగుతాయి. కాబట్టి సమయానికి బ్రేక్‌ఫాస్ట్ చేయడం , క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరం.