Moong dal sprouts vs chana sprouts | మొలకెత్తిన పెసలు vs నల్లశనగలు .. ఏవి ఆరోగ్యానికి మంచివి? నిపుణుల విశ్లేషణ ఇదే! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Moong dal sprouts vs chana sprouts | మొలకెత్తిన పెసలు vs నల్లశనగలు .. ఏవి ఆరోగ్యానికి మంచివి? నిపుణుల విశ్లేషణ ఇదే!

 Authored By sandeep | The Telugu News | Updated on :7 November 2025,12:00 pm

Moong dal sprouts vs chana sprouts | ఈ కాలంలో చాలా మంది మొలకలు (Sprouts) ను తమ ఆహారంలో భాగంగా చేసుకున్నారు. ఇవి తక్కువ కేలరీలతోపాటు అధిక ప్రోటీన్, ఫైబర్, ఖనిజాలతో నిండి ఉండటంతో బరువు తగ్గడం, రోగనిరోధక శక్తి పెంపు, రక్తపోటు నియంత్రణ వంటి అనేక ప్రయోజనాలు అందిస్తాయి. కానీ, మొలకెత్తిన పెసలు (Green gram sprouts) మంచివా? లేక మొలకెత్తిన నల్లశనగలు (Black chickpea sprouts) మంచివా? అని చాలా మందికి సందేహం ఉంటుంది.

#image_title

నిపుణులు చెబుతున్న పోషక వివరాలు, ప్రయోజనాలు ఇవే

మొలకెత్తిన నల్లశనగలలో పోషకాలు

100 గ్రాముల మొలకెత్తిన నల్లశనగలలో

ప్రోటీన్: 20.5 గ్రాములు

ఫైబర్: 12.2 గ్రాములు

కాల్షియం: 57 mg

ఇనుము (Iron): 4.31 mg

పొటాషియం: 718 mg

నల్లశనగల మొలకలను రోజూ తినడం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో, గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడుతుంది.

వీటిలోని ఇనుము, ప్రోటీన్ శరీరానికి శక్తినిస్తాయి. మహిళల్లో హీమోగ్లోబిన్ స్థాయిలను పెంచడంలో ఇవి ఉపయోగపడతాయి.

మొలకెత్తిన పెసలలో పోషకాలు

100 గ్రాముల మొలకెత్తిన పెసలలో

ప్రోటీన్: 23.9 గ్రాములు

ఫైబర్: 16.3 గ్రాములు

కాల్షియం: 132 mg

ఇనుము: 6.74 mg

పొటాషియం: 1250 mg

విటమిన్ C: 4.8 mg

– పెసర మొలకలు బరువు తగ్గడంలో అద్భుత ఫలితాలు ఇస్తాయి.
– ఉదయం ఖాళీ కడుపుతో తింటే మెటాబాలిజం వేగం పెరిగి, కొవ్వు కరిగిపోవడంలో సహాయపడతాయి.
– ఇందులోని విటమిన్ C, యాంటీఆక్సిడెంట్లు కంటి చూపును మెరుగుపరచి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

ఏవి ఉత్తమం?

నిపుణుల అభిప్రాయం ప్రకారం .. పెసర మొలకలులో ప్రోటీన్, కాల్షియం, పొటాషియం, విటమిన్ C ఎక్కువగా ఉండటంతో మొత్తం పోషక విలువల పరంగా శనగల కంటే మెరుగైనవి.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది