Weight Loss : నూనె, ఉప్పు ఎక్కువ వాడేవారు.. పండ్లు, మొలకలు తినలేని వారు.. ఇలా సింపుల్‌గా అదిక బరువు తగ్గొచ్చు..!
Weight Loss : బరువు తగ్గడం అంత ఈజీ కాదు. బరువు పెరగడం ఈజీనే కానీ.. తగ్గాలంటే మాత్రం చాలా కష్టపడాలి. నెలలకు నెలలు చాలా వ్యాయామాలు చేయాలి. కఠినంగా కసరత్తులు చేయాలి. అలాగే.. ఫుడ్ విషయంలోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. అలా అయితేనే బరువు తగ్గడం సాధ్యం అవుతుంది. లేదంటే.. బరువు పెరగడమే తప్పితే తగ్గడం అనేది అస్సలు జరగదు. చాలామంది బరువు తగ్గడం కోసం చాలా కష్టపడతారు. కానీ.. దాన్ని పూర్తిగా అవలంభించరు. దీంతో బరువు తగ్గడం అనేది వాళ్లకు కష్టంగా మారుతుంది. శరీరంలో ఉన్న కొవ్వు కరగాలంటే.. ఖచ్చితంగా కొన్ని విషయాల్లో కఠినంగా ఉండాల్సిందే. లేదంటే బరువు తగ్గడం చాలా కష్టం.
అయితే.. ఎన్ని కసరత్తులు చేసినా.. ఫుడ్ విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొందరు బరువు తగ్గరు. అటువంటి వాళ్లు చేయాల్సింది ఏంటంటే.. కొన్ని ఆయుర్వేద నియమాలను పాటించాలి. అదే ఏక పొద్దు. దాన్నే ఏక భుక్త వ్రతం అని కూడా చెబుతారు. అంటే ఒక్క పూట మాత్రమే భోజనం చేయడం. కంటిన్యూగా.. ఒక నెల పాటు.. ఒక్క పూట మాత్రమే భోజనం చేస్తే.. ఎనర్జీ కోసం శరీరంలో పేరుకుపోయిన ఉన్న కొవ్వును అది ఉపయోగించుకుంటుంది. దాని వల్ల బరువు తగ్గుతారు.
Weight Loss : ఒక్క పూట భోజనం చేసినా.. అందులో ఏం తినాలి?
చాలామంది శ్రావణ మాసంలో.. కొన్ని పవిత్రమైన మాసాల్లో ఒక్క పూట మాత్రమే భోం చేస్తుంటారు. వాళ్లు దేవుడి కోసం పస్తులుంటారు. ఉపవాసం ఉంటారు. నిజానికి వాళ్లు దేవుడి కోసం ఉపవాసం ఉన్నా… అది వాళ్ల ఆరోగ్యానికి మేలు చేకూర్చుతుంది. అధిక బరువు ఉన్నవాళ్లకు అది చాలా బెనిఫిట్ అవుతుంది. బరువు తగ్గుతారు. మీరు మొలకలు తినకపోయినా.. పండ్లు తినకపోయినా.. లేదా ఉప్పును ఎక్కువగా తీసుకున్నా.. నూనె ఎక్కువగా తీసుకున్నా కూడా మీరు ఒకే పూట భోజనం చేయడం వల్ల.. అధిక బరువును ఖచ్చితంగా కోల్పోతారు. శరీరంలో పేరుకుపోయి ఉన్న అధిక కొవ్వు కొంచెం కొంచెం కరిగి.. బరువు తగ్గడానికి దోహదపడుతుంది.
అయితే.. ఒక్క పూట మాత్రమే భోజనం చేయాలనుకుంటే.. ఎక్కువగా మంచినీళ్లు తాగాల్సి ఉంటుంది. ఉదయం లేవగానే.. బాగా నీళ్లు తాగాలి. ఎక్కువగా నీళ్లు తాగడం వల్ల శరీరంలో ఉన్న విష పదార్థాలన్నీ బయటికి వెళ్లిపోతాయి. ఎక్కువగా లిక్విడ్ ఉన్న పదార్థాలను తీసుకుంటూ ఉండే.. ఆకలి కూడా తక్కువగా వేస్తుంది. దాని వల్ల మీరు ఒక్కసారి అన్నం తిన్నా కూడా పెద్దగా ఆకలి కాదు. అలాగే.. మీరు ఒక్కసారే తింటారు కాబట్టి.. అందులో ఎక్కువగా ఆయిల్ ఉన్న ఆహారం అయినా కూడా పెద్దగా నష్టం ఉండదు. కాకపోతే.. ఎక్కువగా మంచినీళ్లను తీసుకుంటే.. శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరగడంతో పాటు.. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
ఇది కూడా చదవండి ==> ఎన్ని నీళ్లు తాగినా యూరిన్ సమస్య రాకుండా ఉండాలంటే ఈ చిట్కాను ఫాలో అవండి..!
ఇది కూడా చదవండి ==> ఈ పువ్వు రసాన్ని ఒక్కసారి వాడితే చాలు.. కంటిచూపు మెరుగు అవుతుంది
ఇది కూడా చదవండి ==> సీతాఫలం ఆకులతో డయాబెటిక్ చెక్.. ఇంకా ఏటువంటి అనారోగ్యలు నయం అవుతాయో తెలుసా..?
ఇది కూడా చదవండి ==> గర్భం దాల్చినట్టు ఎలా తెలుసుకోవాలి.. గర్భం వచ్చేముందు కనిపించే ఐదు లక్షణాలు ఇవే..!