Sprouts | మొలకెత్తిన పెసలు తింటే బరువు తగ్గటమే కాదు.. చర్మం కూడా మెరిసిపోతుంది!
Sprouts | రోజూ మన వంటగదిలో కనిపించే పెసలు.. మొలకెత్తిన తర్వాత ఒక సూపర్‌ఫుడ్‌గా మారతాయి! శరీరానికి అవసరమైన విటమిన్లు, మినరల్స్, ప్రొటీన్లు పుష్కలంగా ఉండే మొలకలు ఆరోగ్యానికి ఎన్నో లాభాలను అందిస్తాయి.
#image_title
మొలకలలో ఉండే ముఖ్య పోషకాలు:
విటమిన్ B కాంప్లెక్స్, విటమిన్ C, విటమిన్ A, ప్రోటీన్, ఫైబర్. ఈ పోషకాలు శరీరానికి తక్కువ కాలొరీలతో అధిక శక్తిని అందిస్తాయి. అంతేకాకుండా, చక్కటి జీర్ణక్రియకు కూడా తోడ్పడతాయి.
మొలకలతో వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు:
బరువు తగ్గే వారికి బెస్ట్ ఆప్షన్
తక్కువ కేలరీలు, అధిక ఫైబర్ కలిగిన మొలకలు ఉదయం అల్పాహారంగా తీసుకుంటే, పొట్ట నిండిన ఫీలింగ్ కలుగుతుంది. దీనివల్ల ఫాస్ట్ ఫుడ్, మళ్లీ తినాలనే ఆసక్తి తగ్గుతుంది.
చర్మానికి మెరుపు
మొలకల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ A, సి చర్మ సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. మొలకెత్తిన పెసరపప్పు తినడం వల్ల మొటిమలు, చర్మంపై వచ్చే ముడతల్ని నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
రోజువారీ డైట్‌లో చేర్చుకోవచ్చు
మొలకల్ని ఉదయపు అల్పాహారంలో లేదా మధ్యాహ్నం స్నాక్స్‌గా తీసుకోవచ్చు. సలాడ్‌లలో కూరగాయలతో కలిపి, కొద్దిగా నిమ్మరసం, మిరియాల పొడి కలిపి తింటే రుచికరంగా ఉంటుంది. అయితే రాత్రిపూట మొలకలు తినడం కొంతమందికి అజీర్తి కలిగించవచ్చు కాబట్టి జాగ్రత్త అవసరం.