High Protein Food : దీన్ని రోజూ నానబెట్టి తినండి.. గుడ్డు కన్నా మూడు రెట్ల బలం వస్తుంది | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

High Protein Food : దీన్ని రోజూ నానబెట్టి తినండి.. గుడ్డు కన్నా మూడు రెట్ల బలం వస్తుంది

 Authored By jagadesh | The Telugu News | Updated on :24 July 2021,9:39 am

High Protein Food : హై ప్రొటీన్ ఫుడ్ అంటే ఏంటో తెలుసా? మీరు తినే ఆహారంలో ఎక్కువ ప్రొటీన్స్ ఉండాలి. వాటి వల్ల శరీరానికి శక్తి రావాలి. బలం రావాలి. అటువంటి ఫుడ్ తీసుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చు.. శక్తిని పొందొచ్చు. ఒంట్లో అంతో ఇంతో శక్తి ఉంటేనే ఏదో ఒక పని చేయగలరు. లేకపోతే పని చేయడం కష్టం. అందుకే చాలామంది ఉడకబెట్టిన గుడ్డును ఎక్కువగా తీసుకుంటారు. గుడ్డును ఎక్కువగా తీసుకుంటే.. శక్తి వస్తుందని నమ్ముతారు. అందులో ఎక్కువ ప్రొటీన్స్ ఉంటాయని గుడ్డును ఎక్కువగా తీసుకుంటారు.

sprouts health benefits telugu

sprouts health benefits telugu

అయితే.. గుడ్డును ఎక్కువగా తీసుకుంటే కూడా మంచిది కాదు. ఎందుకంటే. గుడ్డులో కొలెస్టరాల్ ఎక్కువ. పచ్చ సొనలో కొలెస్టరాల్ ఎక్కువగా ఉంటుంది. దాని వల్ల చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఏ పని చేయకుండా.. ఖాళీ ఉండేవాళ్లు కూడా ఎక్కువగా గుడ్లను తీసుకుంటే.. బరువు పెరుగుతారు. వర్కవుట్స్ చేసేవాళ్లు, కష్టపడి పనిచేసేవాళ్లు అయితే.. గుడ్లను ఎంత తిన్నా ఏం కాదు.

sprouts health benefits telugu

sprouts health benefits telugu

High Protein Food : గుడ్డు బదులు ఇవి తినండి.. చాలా ఆరోగ్యంగా ఉంటారు

చాలామంది గుడ్డును తింటే చాలు.. ఆరోగ్యంగా ఉంటాం అని అనుకుంటారు కానీ.. మీరు నానబెట్టిన పెసలును తింటే.. గుడ్డు కంటే కూడా ఎక్కువ ప్రొటీన్స్ అందులో ఉంటాయి. గుడ్డు కన్నా మూడు రెట్ల ప్రొటీన్స్ ఇందులో ఉంటాయి. ఏవైనా స్పోర్ట్స్ ఆడేవాళ్లు.. బాడీని బిల్డ్ చేసుకునే వాళ్లు.. గుడ్డును తీసుకోవచ్చు కానీ.. వర్కవుట్స్ చేయని వాళ్లు ఎక్కువగా గుడ్లను తీసుకున్నా ప్రమాదమే.

sprouts health benefits telugu

sprouts health benefits telugu

అందుకే.. ఎవ్వరైనా.. ఒంట్లో శక్తి కావాలనుకునేవాళ్లు.. హై ప్రొటీన్స్ కావాలనుకునే వాళ్లు.. నానబెట్టిన పెసలును తినండి. రాత్రిపూట పెసళ్లను నానబెట్టి.. ఉదయం మొలకెత్తాక తినండి. పెసలు పెద్దగా ఖరీదు కూడా ఉండదు. రోజూ ఓ గుప్పెడు పెసలు తింటే.. అందులో చాలా ప్రొటీన్స్ అందుతాయి. అందుకే.. ఇక నుంచి ప్రొటీన్స్ ఎక్కువగా ఉండే.. పెసలును మొలకెత్తాక తినడం అలవాటు చేసుకోండి.. ఆరోగ్యంగా ఉండండి.

ఇది కూడా చ‌ద‌వండి ==> 15 ర‌కాల పుట్ట‌గోడుగులు.. వాటి ఆరోగ్య ప్ర‌యోజనాలు తెలిస్తే మీరు అస్స‌లు వ‌ద‌ల‌రు..!

ఇది కూడా చ‌ద‌వండి ==> మీర‌ప‌కాయ‌లు కారంగా ఉంటాయ‌ని తిన‌డం మానేస్తే… మీరు ఈ ఆరోగ్య‌ ప్ర‌యోజ‌నాలు కోల్పోయిన‌ట్టే

ఇది కూడా చ‌ద‌వండి ==> ఎర్ర బెండకాయలను ఎప్పుడైనా చూశారా? ఇవి ఆరోగ్యానికి ఎంత మంచివో తెలుసా?

ఇది కూడా చ‌ద‌వండి ==> పులిపిర్లు ఎందుకు వస్తాయి? వాటిని శాశ్వతంగా తొలగించడం ఎలా?

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది