Mushrooms | పుట్టగొడుగుతో ఉపయోగాలు ఎన్నో.. ఇది ఆరోగ్యానికి పోషకాల గని
Mushrooms | పుట్టగొడుగులు, చిన్నగా కనిపించినా, ఆరోగ్యానికి ముఖ్యమైన పోషకాలతో నిండి ఉంటాయి. వీటిలో విటమిన్లు, సెలీనియం, పొటాషియం వంటి ఎన్నో ముఖ్యమైన పోషకాలు ఉంటాయి, అవి కేవలం రుచికి మాత్రమే కాకుండా, మన శరీరానికి కూడా చాలా మేలు చేస్తాయి.
#image_title
ఇవి ఉపయోగాలు..
మీరు ఉదయాన్నే లేచి అలసిపోయినట్లు అనిపిస్తుంటే, మీ శరీరంలో బి-విటమిన్లు తగ్గిపోవచ్చు. పుట్టగొడుగుల్లో B2, B3, మరియు పాంతోథెనిక్ ఆమ్లం వంటి విటమిన్లు ఉండటం వలన శరీరానికి శక్తి ఇవ్వడమే కాకుండా, నాడీ వ్యవస్థను బలోపేతం చేయడంలో కూడా ఇవి సహాయపడతాయి. పుట్టగొడుగుల్లో సెలీనియం ముఖ్యమైన ఖనిజం. సెలీనియం మన శరీరంలోని కణాలను రక్షించడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి, మరియు థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేయడానికి అవసరం. కాబట్టి, శాఖాహారం తీసుకునే వారికి ఇది గొప్ప పోషకంగా ఉంటుంది.
పొటాషియం, సాధారణంగా అరటిపండ్లలో ఎక్కువగా ఉంటుందని మనం భావిస్తాం, కానీ పుట్టగొడుగుల్లో కూడా ఈ ఖనిజం చాలా ఉంటుంది. పొటాషియం శరీరంలో నీటి సమతుల్యతను కాపాడటంతో పాటు, కండరాలను బలంగా ఉంచేందుకు, రక్తపోటును కంట్రోల్ చేయడంలో సహాయపడుతుంది. కళ్ళు ఎర్రబడడం లేదా కండరాలు తిమ్మిరి పోవడం వంటి సమస్యలు పొటాషియం లోపంతో సంభవిస్తాయి. ఇలాంటి సమస్యలను నివారించడానికి పుట్టగొడుగులు ఉపయోగపడతాయి. పుట్టగొడుగుల్లో గ్లూటాతియోన్, ఎర్గోథియోనిన్ అనే యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి కణాలను ముసలివి అయ్యే నుండి రక్షించి, వ్యాధులు రాకుండా కాపాడతాయి.