Zucchini Benefits : జూచిని తో ఎన్ని ప్రయోజనాలో… ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే….!
ప్రధానాంశాలు:
Zucchini Benefits : జూచిని తో ఎన్ని ప్రయోజనాలో... ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే....!
Zucchini Benefits : వేసవికాలం అంటేనే మండే ఎండలు వేడి వాటిని తగ్గించడానికి ప్రజలు నిత్యం చల్లని ఆహారాలు తోసుకుంటూ ఉంటారు. తమ శరీరాన్ని చల్లగా ఉంచడం కోసం మజ్జిగ, లస్తి, పెరుగు, దోసకాయ వంటి కూరగాయలను, ద్రవ్యాలను తాగుతూ ఉంటారు.వీటిని వేసవి కాలంలోనే ఎక్కువగా ఇష్టపడతారు. అయితే వేసవిలో ఎక్కువగా లభించే ఉపయోగకరమైన కూరగాయలలో జూచి ప్రధానమైనదని చెప్పాలి. అయితే ఈ జూచి అనేది దోసకాయ జాతికి చెందినది.ఈ వెజిటేబుల్ చూడడానికి దోసకాయ దొండకాయ లాగా కనిపిస్తుంది. కానీ ఇందులో చాలానే ఉపయోగకరమైన పోషకాలు ఉన్నాయి.జూచిలో పీచు , ఐరన్, క్యాల్షియం, జింక్, విటమిన్ కే, విటమిన్ సి విటమిన్ బి 6, మెగ్నీషియం పొటాషియం, మాంగనేష్ వంటి అనేక రకాల పోషకాలు పుష్కంగా లభిస్తాయి.అయితే ఈ పదార్థంలో 80 నుండి 90% వరకు నీరు ఉంటుంది. తద్వారా శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచెందుకు ఇది ఎంతగానే సహాయపడుతుంది.
ఇక ఈ వెజిటేబుల్ బీపీ, టైప్ 2, మధుమేహం మరియు పోషకాలు ఎముకలను దృఢంగా ఉంచడంలో ఎంతగానో సహాయపడుతుంది.ఇది చూడడానికి దోసకాయల ఉన్నప్పటికీ దీని ప్రయోజనాలు మాత్రం అద్భుతం అని చెప్పుకోవాలి.
Zucchini Benefits : జూచీని తినడం వలన కలిగే ప్రయోజనాలు…
మెరుగైన జీర్ణక్రియ: ఈ వెజిటేబుల్ తీసుకోవడం వలన ఇది జీర్ణక్రియకు ఎంతో సహాయపడుతుంది.అలాగే దీనిని క్రమం తప్పకుండా వాడడం వలన అనేక రకాల కడుపుకు సంబంధించిన సమస్యల నుండి త్వరగా ఉపశమనం పొందవచ్చు.ఇది మలబద్ధకం నుండి కూడా త్వరగా ఉపశమనం కలిగిస్తుంది.
Zucchini Benefits : ఫైన్ లైన్స్ నుండి ఉపశమనం
జూచిని లో అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి.దీనివల్ల చర్మంపై త్వరగా వయసు ,ల్ ప్రభావాలు కనిపించవు. జూచీని ఎక్కువగా తినడం వల్ల వయసు పెరిగే కొద్దీ ముఖంపై కనిపించే ముడతలు మచ్చలు అనేవి రాకుండా పోతాయి. అలాగే ఫైన్ లైన్స్ సమస్య తగ్గుముఖం పడుతుంది.
Zucchini Benefits : డయాబెటిస్
జూచిని మధుమేహ రోగాలకు ఔషధం లాగా పనిచేస్తుంది.ఇందులో ఉండే ఫైబర్ , కార్బోహైడ్రేట్లు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడానికి ఎంతగానే ఉపయోగపడాతాయి. తద్వారా రక్తంలోని చక్కెరను తగ్గించడంతోపాటు ఇన్సులిన్ ని పెంచుతాయి.
Zucchini Benefits : బ్లడ్ ప్రెషర్…
పబ్ మెట్ సెంట్రల్ పరిశోధన ప్రకారం చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో జూచి ప్రభావంతంగా పని చేస్తుంది. జూచి లొ కొలెస్ట్రాల్ ఫ్రీ.ఇది చెడు కొలెస్ట్రాల సమస్యతో బాధపడుతున్న వారికి సహాయపడుతుంది.దీనిని రోజు ఆహారంతో తీసుకోవడం వలన కొలెస్ట్రాల్ నుండి ఉపశమనం పొందవచ్చు , అలాగే ఎల్డిఎల్ దీని కారణంగా గుండె ఆరోగ్యానికి కూడా మంచిదని భావిస్తారు.జూచి అధిక రక్తపోటు నియంత్రించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.
బరువు తగ్గడంలో ఉపయోగకరమైనది…
బరువు తగ్గాలి అనుకునే వారికి జూచి ఎంతగానే ఉపయోగపడుతుంది.జూచి లో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. అలాగే ఫైబర్లు పుష్కలంగాా ఉంటాయి.దీనివల్ల వ్యక్తి యొక్క కడుపు చాలా కాలం పాటు నిండుగా ఉంటుంది. తద్వారా అతను అతిగా తినడం మానుకుంటారు. మరియు బరువు నియంత్రణలో ఉంటుంది.