Black Vs Red Clay Pot : వేసవికాలంలో ఎరుపు లేదా నలుపు …. ఏ కుండలో నీటిని తాగితే మంచిదో మీకు తెలుసా…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Black Vs Red Clay Pot : వేసవికాలంలో ఎరుపు లేదా నలుపు …. ఏ కుండలో నీటిని తాగితే మంచిదో మీకు తెలుసా…?

 Authored By ramu | The Telugu News | Updated on :1 April 2025,8:00 am

ప్రధానాంశాలు:

  •  Black Vs Red Clay Pot : వేసవికాలంలో ఎరుపు లేదా నలుపు .... ఏ కుండలో నీటిని తాగితే మంచిదో మీకు తెలుసా...?

Black Vs Red Clay Pot : సమ్మర్ వచ్చేసింది గా.. ఇక అందరూ కూడా చల్లటి నీళ్ల కోసం తాపత్రయం పడతారు. దాహం వేస్తే ఫ్రిజ్ దగ్గరికి వెళ్లి కూల్ కూల్ గా నీటిని తాగుతారు. కానీ ఫ్రిడ్జ్ లోని వాటర్ బాగా కూల్ అవుతాయి. వాటిని వెంటనే తాగితే మనకు జలుబు చేస్తుంది. కాబట్టి కొందరు కేవలం మట్టికుండలను మాత్రమే వాడుతుంటారు. ఫ్రిడ్జ్ లోని బాటిల్స్ పెట్టిన వాటర్ తాగితే హెల్త్ ప్రాబ్లమ్స్ పెరుగుతాయి తప్పా తగ్గవు. కానీ కుండలోని నీటిని తాగితే ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ మట్టి కుండలో కూడా రకాలు ఉంటాయి. అవి రెండు రకాల కుండలు. ఒకటి ఎరుపు కుండ, రెండు నలుపు రంగులో ఉన్న మట్టికుండలు అందుబాటులో ఉన్నాయి. ఈ రెండు కుండల్లో కూడా ఏ కుండ మంచిదో తెలుసుకుందాం…

Black Vs Red Clay Pot వేసవికాలంలో ఎరుపు లేదా నలుపు ఏ కుండలో నీటిని తాగితే మంచిదో మీకు తెలుసా

Black Vs Red Clay Pot : వేసవికాలంలో ఎరుపు లేదా నలుపు …. ఏ కుండలో నీటిని తాగితే మంచిదో మీకు తెలుసా…?

ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఎండలు బాగా పెరిగాయి. ఎండలు ఈ సంవత్సరం ఇంకా ఎక్కువగా ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. అలాగే ఫిబ్రవరి నెల ఆఖరి నుంచి సూర్యుడు ప్రతాపం మొదలుపెట్టాడు. ఎండలకు శరీరం డిహైడ్రేషన్కు గురవుతూ ఉంటుంది. ఎండ నుంచి ఉపశమనం పొందడానికి చల్లని నీటిని లేదా చల్లని పానీయాలు కోసం వెతుకులాడుతాం. అయితే, ఫ్రిడ్జ్ నీళ్లను ఈరోజుల్లో ఎక్కువగా తాగుతూ ఉంటారు. ఈ ఫ్రిడ్జ్ వాటర్ తాగితే జలుబు చేసే అవకాశాలు కూడా ఎక్కువే. ఇవి విపరీతమైన కూల్ అవుతాయి. నార్మల్ కూల్ తాగితే మనకి ఆరోగ్యం. హెవీగా కూల్ అయిన వాటర్ ని తాగితే మాత్రం అనారోగ్యం. అందుకే, మట్టి కుండ వాడటం శ్రేష్టం. ఈ మట్టి కుండలోని నీళ్లు తాగడం వల్ల బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

Black Vs Red Clay Pot ఏ కుండలోని నీరు శ్రేష్టం

ఈ మట్టి కుండలో నీరు మనకి ఎంతవరకు కూల్ గా అవ్వాలో అంతవరకే కూల్ అవుతాయి. వీటిని తాగితే మనకి జలుబు రాదు. పూర్వంలో కూడా మట్టికుండలలోని నీటిని తాగే వారు. ఇప్పుడు ఫ్రిజ్లు వచ్చినాక మట్టి కుండల వాడకం తగ్గిపోయింది. కాబట్టి, మట్టి కుండలో నీటిని తాగటమే ఉత్తమం. మరి ఈ మట్టి కుండలో ఎర్రటి కుండలు ఉంటాయి, మరికొన్ని నల్లని కుండలు ఉంటాయి. ఎక్కువగా ప్రజలు ఎర్ర మట్టి కుండలనే వినియోగిస్తుంటారు. ఇది టెర్రకోట బంకమట్టితో తయారుచేస్తారు. దీని అడుగున చిన్న రంధ్రాలను కలిగి ఉంటుంది. దీంతో గాలి నెమ్మదిగా లోపలికి వెళ్లి నీటిని చల్లబరుస్తాయి. నల్లకుండలను నల్ల మట్టి, ఒకటో కాల్చడం ద్వారా తయారు చేస్తారు. దీని నిర్మాణం నీటిని ఎక్కువసేపు చల్లగా ఉంచుతుంది. దీనిని కార్బోనైజడ్ క్లే పాట్ అని కూడా అంటారు. నల్లకుంట ఉపరితలంపై ఆల్గే, బ్యాక్టీరియా త్వరగా పెరగవు. కాబట్టి నీరు ఎక్కువ సమయం పాటు తాజాగా ఉంటుంది. శరీరానికి కావాల్సిన ఖనిజాలు కూడా లభిస్తాయి. నీకు ఉండనే అమృత్ జెల్ అంటారు.
మీకు త్వరగా చల్లటి నీరు అవసరమైతే ఎర్రటి మట్టితో చేసిన కుండా ఉత్తమం. కానీ మీరు నీటిని ఎక్కువ సేపు చల్లగా ఉంచాలనుకుంటే నల్లటి కుండా మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్య దృక్కోణం నుండి ఆయుర్వేదం ప్రకారం నల్లకుండ నీరు మరింత ఆరోగ్యకరమైనదిగా పరిగణించబడింది. ఎందుకంటే ఇందులో ఖనిజాలు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది