Sweat | చెమట వాసనను నిర్లక్ష్యం చేయొద్దు.. ఆ వ్యాధులకి సంకేతం కావచ్చని వైద్యులు హెచ్చరిక
Sweat | శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే సహజ ప్రక్రియ అయిన చెమట పట్టడం (Sweating) ఆరోగ్యపరంగా సాధారణ విషయం. కానీ, ఆ చెమట వింతగా, తీవ్రమైన లేదా భరించలేని దుర్వాసన వస్తే మాత్రం జాగ్రత్త అవసరం.
#image_title
చెమట వాసన వెనుక దాగి ఉన్న ఆరోగ్య సమస్యలు
1. మధుమేహం (Diabetes): ‘కీటోన్ బ్రీత్’ లక్షణం
చెమటకు తీపి లేదా పండ్ల వాసన వస్తుంటే, అది మధుమేహానికి సంకేతంగా భావించాలి. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణ తప్పినప్పుడు శరీరం అదనపు గ్లూకోజ్‌ను చెమట ద్వారా విడుదల చేస్తుంది. దీనిని వైద్యపరంగా కీటోన్ బ్రీత్ (Ketone Breath) అంటారు.
2. కాలేయం, మూత్రపిండాల సమస్యలు
చెమట నుంచి అమోనియా లేదా మూత్రం వంటి బలమైన వాసన వస్తే, అది కాలేయం లేదా మూత్రపిండాల లోపాలకు సూచన కావచ్చు. శరీరం వ్యర్థాలను సరిగా తొలగించలేనప్పుడు ఈ పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా మూత్రపిండాల వ్యాధి లేదా కాలేయ సిర్రోసిస్ ఉన్నవారిలో ఈ లక్షణం స్పష్టంగా కనిపిస్తుంది.
3. థైరాయిడ్ అసమతుల్యత (Thyroid Imbalance)
హైపర్‌థైరాయిడిజం వంటి హార్మోన్ల లోపాలు చెమట ఉత్పత్తిని పెంచి, వాసనలో మార్పులకు దారితీస్తాయి. ఇది శరీర రసాయన ప్రతిచర్యలపై ప్రభావం చూపుతుంది.
4. బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్లు
చర్మంపై ఉండే బ్యాక్టీరియా లేదా ఫంగస్ చెమటతో కలిసినప్పుడు దుర్వాసన కలిగించే రసాయనాలు ఉత్పత్తి చేస్తాయి. వాసన బలంగా, ఎక్కువ కాలం కొనసాగితే, అది ఇన్ఫెక్షన్ సంకేతం కావచ్చు.