Rains | రానున్న మూడు రోజులలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకి బిగ్ అలర్ట్
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. రుతుపవన ప్రభావంతో మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు, వరంగల్ జిల్లాల్లో భారీ వానలు కురుస్తాయని వెల్లడించింది.

#image_title
మళ్లీ వర్షాలు..
ఈ నేపథ్యంలో ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇతర జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులతో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది.బుధవారం భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, వరంగల్, భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల, ఆదిలాబాద్, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
బుధవారం (ఆగస్టు 27) రోజున భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, హైదరాబాద్, జగిత్యాల, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, ఖమ్మం, కొమురంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, మేడ్చల్ మల్కాజ్‌గిరి, ములుగు, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలలతో (గాలి వేగం గంటకు 30 నుంచి 40 కి.మీ ) కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది.