Heavy Rains | నేటి నుండి తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్
Heavy Rains | తెలంగాణ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో వాతావరణ శాఖ ఆరెంజ్ మరియు ఎల్లో అలర్ట్‌లు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడుతున్నట్లు తెలిపింది. శనివారం (ఆగస్టు 16) – ఆరెంజ్ అలర్ట్ జిల్లాలు చూస్తే.. నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

#image_title
వర్షాలే వర్షాలు..
ఎల్లో అలర్ట్ జిల్లాలు.. ఆదిలాబాద్, కొమురంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, వికారాబాద్, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదివారం (ఆగస్టు 17) – ఆరెంజ్ అలర్ట్ జిల్లాలు చూస్తే.. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ
ఎల్లో అలర్ట్ జిల్లాలు.. ఆదిలాబాద్, కొమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, అలాగే గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో గాలి వీచే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.