Telangana | తెలంగాణలో దంచికొడుతున్న వర్షాలు.. 11 జిల్లాలకు ఆరెంజ్ వార్నింగ్
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు రోజులు (ఆది, సోమవారం) ఇంకా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
#image_title
వాయుగుండం ప్రభావం తీవ్రం
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం శనివారం ఉదయం ఒడిశాలోని గోపాల్‌పూర్ వద్ద తీరం దాటి, ప్రస్తుతం దక్షిణ ఒడిశా–ఛత్తీస్‌గఢ్ ప్రాంతంలో తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో తెలంగాణ మీదుగా మహారాష్ట్ర, గోవా వరకు 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి ఏర్పడింది.
ఈ వాతావరణ మార్పుల వల్ల రాష్ట్రంలో మిగతా జిల్లాల్లో కూడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది . ఈరోజు (ఆదివారం) ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాలు చూస్తే, అదిలాబాద్,ఆసిఫాబాద్,మంచిర్యాల,నిర్మల్,నిజామాబాద్,కరీంనగర్,పెద్దపల్లి,భూపాలపల్లి,ములుగు, మహబూబాబాద్, సంగారెడ్డి (కొన్ని ప్రాంతాలు). ఈ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాల సమయంలో ఇళ్లలో ఉండటానికి ప్రయత్నించండి, వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో ఉండే వారు అప్రమత్తంగా ఉండాలి