TRAFFIC JAM: సంక్రాంతి ఎఫెక్ట్.. పట్నం వదిలేసి పల్లెబాట పట్టిన నగర వాసులు.. వాహనాల రద్దీ
ప్రధానాంశాలు:
TRAFFIC JAM: సంక్రాంతి ఎఫెక్ట్.. పట్నం వదిలేసి పల్లెబాట పట్టిన నగర వాసులు.. వాహనాల రద్దీ
TRAFFIC JAM: సెలవులు వచ్చాయంటే నగర వాసులు సొంతూళ్లకి వెళ్లిపోవడం మనం చూస్తూనే ఉన్నాం. దసరా, సంక్రాంతికి సెలవులు కాస్త ఎక్కువ ఉంటాయి కాబట్టి చాలా మంది తమ తమ ప్రాంతాలకి వెళుతుంటారు. సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్తున్న వారితో హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై National Highway వాహనాల రద్దీ పెరిగింది. చౌటుప్పల్ పంతంగి టోల్ ప్లాజా వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. 10 టోల్‌బూత్‌ల ద్వారా ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్తున్న వాహనాలను టోల్ ప్లాజా సిబ్బంది పంపిస్తున్నారు. హైదరాబాద్ వైపు వచ్చే వాహనాలను ఆరు గేట్ల ద్వారా పంపిస్తున్నారు. చౌటుప్పల్ కూడలిలో అండర్‌పాస్ నిర్మాణ పనుల వల్ల భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
TRAFFIC JAM: పరుగో పరుగు..
నగరవాసులు సొంత ఊళ్లకు బయలుదేరడంతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి వాహనాలతో కిక్కిరిసిపోయింది. అబ్దుల్లాపూర్‌మెట్ ఔటర్ రింగ్ రోడ్డు నుంచి కొత్తగూడెం వరకు వాహనాలు నత్తనడకన సాగుతున్నాయి. మరోవైపు పెద్ద అంబర్పేట్ ఔటర్ రింగ్ రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ Traffic JAm ఏర్పడింది. ఔటర్‌పై వాహనాలు బారులు తీరాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక హైదరాబాద్ నగరం నలుమూలలా ఎటుచూసినా రద్దీనే కనిపిస్తోంది. రహదారులే కాదు.. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్లతో పాటు ఎంజీబీఎస్, జేబీఎస్‌లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయ్.
పంతంగి, కొర్లపహాడ్ టోల్ గేట్ల దగ్గర కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. దాంతో, ట్రాఫిక్ నెమ్మదిగా కదులుతోంది.హైదరాబాద్-విజయవాడ హైవే.. హెవీ ట్రాఫిక్‌తో నిండిపోయింది. వేలాది వాహనాలు ఒక్కసారిగా రోడ్డెక్కడంతో.. ట్రాఫిక్ వెరీవెరీ స్లోగా కదులుతోంది. జిల్లాలకు వెళ్లే రహదారులపైనా భారీ రద్దీ నెలకొంది. టోల్ గేట్ల దగ్గర వెహికల్స్ జామ్ అవుతున్నాయి. హైదరాబాద్ – నాగార్జున సాగర్ హైవే మీదుగా వాహనాలను మళ్లిస్తున్నారు. ఓఆర్ఆర్ ORR పైకి వెళ్లి బొంగులూరు గేట్ వద్ద ఎగ్జిట్ తీసుకుంటే మంచిదని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. ఖమ్మం, విజయవాడ వైపు వెళ్లేవారికి ప్రత్యామ్నాయ మార్గాలు చూపిస్తున్నారు. భువనగిరి, రామన్నపేట మీదుగా చిట్యాలకు చేరుకోవాలని సూచిస్తున్నారు. భువనగిరి వైపు వెళ్లేందుకు ఓఆర్ఆర్ పైకి వెళ్లి ఘట్‌కేసర్ వద్ద ఎగ్జిట్ కావాలని సూచిస్తున్నారు.