BRUSH | వాటి ముందు బ్రష్‌లు కూడా వేస్ట్.. ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా?
BRUSH | ఈ రోజుల్లో దంతాల ఆరోగ్యానికి టూత్‌పేస్ట్‌లు, బ్రష్‌లు వాడటం సాధారణం. అయితే, ఇవి కొన్నిసార్లు దంతాలు పసుపు రంగులోకి మారడానికి, చిగుళ్ల బలహీనతకు కారణమవుతాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఆయుర్వేదంలో టూత్‌బ్రష్‌లకు బదులుగా ప్రకృతిలో లభించే వేప, అకాసియా, కరంజా వంటి చెట్ల కర్రలను ఉపయోగించమని సూచిస్తున్నారు.
#image_title
సహజ టూత్ బ్రష్‌ల ప్రయోజనాలు
వేప, అకాసియా కర్రలు చేదు రుచితో ఉండి యాంటీబాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటాయి. వీటిని నమలడం ద్వారా ఫైబర్స్ పళ్ల మధ్యకి చొచ్చుకుపోయి ఆహార అవశేషాలను, ఫ్లాక్‌ను తొలగిస్తాయి. క్రమం తప్పకుండా వాడితే పళ్లపై ఉండే పసుపు వర్ణం, పాచి తొలగిపోతుంది. ఫలితంగా పళ్లు మెరిసేలా మారతాయి. ఈ సహజ టూత్‌బ్రష్‌లు నోటిలోని బ్యాక్టీరియాను తొలగించి, దుర్వాసన సమస్యను తగ్గిస్తాయి.
ఉదయం లేచిన వెంటనే వేప లేదా అకాసియా పలుచని కర్రను తీసుకోండి. దాని ఒక చివరను నమిలి బ్రష్‌లా చేసుకోండి. ఆ చివరతో పళ్లపై, చిగుళ్లపై సున్నితంగా రుద్దండి. ఇలా చేస్తే పళ్లు శుభ్రంగా మారటమే కాకుండా, నోటి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. మొత్తానికి, ఆధునిక టూత్‌బ్రష్‌లతో పోలిస్తే ప్రకృతి ఇచ్చిన ఈ సహజ పద్ధతులు దంతాలకు రక్షణ కవచంలా పనిచేస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.