kavitha : కవితను చివరి నిముషంలో ఎమ్మెల్సీ చేయడానికి కారణాలు ఇవే..
kavitha : తెలంగాణ రాజకీయాలు రోజుకో రకంగా మారిపోతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం ఎవరి వల్ల కావట్లేదు. మొన్నటి వరకు కవితను రాజ్యసభకు నామినేట్ చేస్తారనే ప్రచారం జరిగింది. ఎందుకంటే ఎమ్మెల్యేల కోటాలో అప్పటి వరకు రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బండ ప్రకాశ్‌కు ఎమ్మెల్సీ ఇవ్వడంతో ఆ ప్లేస్ లో కవితను పంపిస్తారనే ప్రచారం అటు అధికార టీఆర్ ఎస్‌లో ఇటు ప్రతిపక్ష పార్టీల్లో విపరీతంగా చర్చ సాగింది. అయితే అందరికీ షాక్ ఇస్తూ కల్వకుంట్ల కవితకు ఎమ్మెల్సీ ఇవ్వడం సంచలనంగా మారిపోయింది.
అయితే ఎవరూ పోటీకి దిగక పోవడంతో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎమ్మెల్సీ పదవిలో కవిత దాదాపు ఆరేళ్లు ఉంటారు. ఇక ఆమెను మంత్రి పదవిలోకి తీసుకుంటారా అనేది మొదటి నుంచి వినిపిస్తున్న ప్రచారం. మరి కేసీఆర్ మొదట నిజామాబాద్ స్థానిక సంస్థల కోటాలో ఆకుల లలితను అనౌన్స్ చేసిన తర్వాత కవితకు ఎందుకు కట్టబెట్టారన్నది ఇప్పుడు అందరికీ కలుగుతున్న ప్రశ్న. అయితే ఇది వ్యూహాత్మకంగానే జరిగినట్టు సమాచారం. ఎందుకంటే కవితకు రాజ్యసభ ఇష్టం లేదంట. ఇప్పటికే ఆ పదవి కాలం దగ్గర పడటం, కేవలం మూడేళ్లు మాత్రమే ఉండటంతో దీనికి కవిత ససేమిరా అన్నారంట.

here are some common reasons why kavitha can be emulsified at the last minute
kavitha : రాజ్య సభ మూడేళ్లే ఉండటంతో..
ఇందులో భాగంగానే రాష్ట్ర రాజకీయా్లో మళ్లీ తన హవా కొనసాగాలంటే ఇక్కడే ఉండటం ఉత్తమం అని తండ్రి కేసీఆర్ కు చెప్పి మరీ ఈ పదవి దక్కించుకుందని తెలుస్తోంది. ఆమె కోరిక మేరకు కేసీఆర్ చివరి నిముషంలో ప్లాన్ చేంజ్ చేసినట్టు తెలుస్తోంది. ఇంకో వైపు చూస్తే రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదన్నట్టు తెలుస్తోంది. ఇక ప్లేస్ లో ఇంకొకరు పోటీ చేస్తారని ప్రచారం అధికార టీఆర్ ఎస్‌లో జరుగుతోంది. ఇప్పుడు మంత్రి పదవిలో ఉన్న నేతతో పాటు మరో ఎమ్మెల్యే పేర్లు ఎంపీ సీటుకు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అక్కడ బీజేపీ క్రమంగా బలపడటంతో మరోసారి ఓటమి పాలవ్వకుండా జాగ్రత్త పడుతున్నారంట కవిత. అందుకే ఎన్నికలకు దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది.