YS Jagan : జగన్ జీవో మీద భారీ ట్విస్ట్ ఇచ్చిన హైకోర్టు..!
YS Jagan : ఏపీలో ప్రస్తుతం జీవో వన్ గురించే చర్చ. ఇటీవలే జీవో వన్ ను ఏపీ ప్రభుత్వం అమలు చేసింది. రాష్ట్రంలో ఇదివరకు జరిగిన పలు సంఘటనలను దృష్టిలో పెట్టుకొని ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవో అది. రాష్ట్రంలో రోడ్ల మీద ఎలాంటి బహిరంగ సభలు, ర్యాలీలను నిర్వహించకూడదని.. రాష్ట్ర హోం మంత్రిత్వ శాఖ జీవో జారీ చేసింది. ఇటీవల టీడీపీ పార్టీ చేసిన బహిరంగ సభలలో జరిగిన అపశృతి మరోసారి జరగకూడదని ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే.. ఈ జీవో నెంబర్ 1 పై ఏపీ హైకోర్టులో ప్రతిపక్ష పార్టీలు కేసులు వేశాయి.
దీంతో వారికి అనుకూలంగా వెకేషన్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జీవోను సస్పెండ్ చేసి.. ఈనెల 23కు దాన్ని వాయిదా వేసింది. ఈ కేసును హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా సారథ్యంలోని ధర్మాసనం వాదనలను చేపట్టింది. అయితే.. జీవో నెంబర్ వన్ ను సస్పెండ్ చేస్తూ ఇటీవల వెకేషన్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. అలా ఎలా ప్రభుత్వం ఇచ్చిన జీవోను సస్పెండ్ చేస్తారంటూ వెకేషన్ బెంచ్ ఇచ్చిన తీర్పును తప్పుపట్టింది. తాజాగా మరోసారి ఈ పిటిషన్ పై చీఫ్ జస్టిస్ సారథ్యంలోని బెంచ్ విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరుపు న్యాయవాదుల వాదనలను, పిటిషనర్ల తరుపు వాదనలను విన్న బెంచ్..
YS Jagan : మరోసారి విచారించిన చీఫ్ జస్టిస్ బెంచ్
పిటిషనర్ల తరుపు న్యాయవాదుల వాదనలతో ఏకీభవించలేదు. అయితే.. అడ్వకేట్ జనరల్ మాత్రం సెక్షన్ 30 లో ఉన్న నిబంధనలకు అనుగుణంగానే బహిరంగ సభలను నియంత్రించడానికి ఆదేశాలు ఇచ్చామని స్పష్టం చేశారు. దీంతో వాదనలు విన్న ధర్మాసనం దానిపై తీర్పును రిజర్వ్ చేసింది. ఇరువురి వాదనలను విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. కాకపోతే.. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే జిల్లా పోలీస్ సూపరింటెండెంట్లు, పోలీస్ కమిషనర్ల అనుమతి తీసుకొని సభలు నిర్వహించుకోవచ్చని ప్రభుత్వం వెసులుబాటు కల్పించిన విషయం తెలిసిందే.