Bandaru Dattatraya : దత్తాత్రేయపై అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల దాడి.. చట్టపరమైన చర్యలకు స్పీకర్ సిద్ధం
Bandaru Dattatraya : బండారు దత్తాత్రేయ తెలుసు కదా. తెలంగాణకు చెందిన బీజేపీ సీనియర్ నేతే. ఆయన్ను హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా నియమించారు. అయితే.. హిమాచల్ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయిన సందర్భంగా గవర్నర్ దత్తాత్రేయ ప్రసంగించారు. ఈ సమయంలో అసెంబ్లీలో ఓ ఘటన చోటు చేసుకుంది.
కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు.. దత్తాత్రేయ ప్రసంగిస్తుండగానే ఆయన మీదికి వచ్చి దాడికి యత్నించారు. ఈ ఘటనపై హిమాచల్ అసెంబ్లీ స్పీకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే గవర్నర్ పై దాడికి పాల్పడిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై వేటు వేశారు.
అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ నేతగా ఉన్న ముకేశ్ అగ్నిహోత్రితో పాటు మరో నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేశారు. వాళ్లు బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు అసెంబ్లీలో అడుగు పెట్టడానికి వీళ్లేదని స్పష్టం చేశారు.
Bandaru Dattatraya : హిమాచల్ చరిత్రలోనే గవర్నర్ పై చేయి చేసుకోవడం మొదటిసారి
అయితే.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ తో పాటుగా.. వాళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి హిమాచల్ ఎమ్మెల్యే సన్నద్దమయ్యారు. ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై పోలీసు కేసు పెట్టడం కోసం అసెంబ్లీ రూల్స్ ను చెక్ చేస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్ చరిత్రలోనే ఇలా గవర్నర్ పై దాడి చేయడం మొదటిసారని.. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా ఉండాలంటే.. ఖచ్చితంగా వాళ్లపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.
అయితే.. గవర్నర్ మధ్యలోనే ప్రసంగాన్ని ఆపేశారని.. అందుకే ఆయన్ను ప్రసంగం ఎందుకు ఆపేశారని అడగడం కోసమే ఆయన దగ్గరికి వెళ్లామని.. అంతే కానీ.. ఆయనపై దాడి చేయడం కోసం కాదంటూ.. సస్పెండ్ అయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ చౌహాన్ మీడియాకు తెలిపారు. గవర్నర్ పై దాడి చేయాలనే ఉద్దేశం తమకు అస్సలు లేదని చౌహాన్ స్పష్టం చేశారు.