ముక్కలయినా తిరిగి అతుక్కునే శివలింగం ఎక్కడుందో తెలుసా? ఆ శివలింగం మహిమ తెలిస్తే అవాక్కవడం ఖాయం? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

ముక్కలయినా తిరిగి అతుక్కునే శివలింగం ఎక్కడుందో తెలుసా? ఆ శివలింగం మహిమ తెలిస్తే అవాక్కవడం ఖాయం?

టైటిల్ చదివే ఆశ్చర్యపోయారు కదా. ఇంకా దాని గురించి మొత్తం తెలుసుకుంటే అవాక్కవ్వాల్సిందే మీరు. నిజానికి ఈ భూమ్మీద ఎన్నో వింతలు, విశేషాలు, ఎన్నో అంతుచిక్కని రహస్యాలు. సైన్స్ కు కూడా అంతపట్టని రహస్యాలు ఎన్నో దాగి ఉన్నాయి. వాటిలో ఒకటి ఈ బిజ్లీ మహదేవ్ గుడి. ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే.. ఈ గుడిలో ఉన్న శివలింగం ముక్కలు అయినా కూడా వెంటనే తిరిగి అతుక్కొని మామూలు శివలింగంలా మారుతుంది. దీని అసలు రహస్యం ఏంటో […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :24 May 2021,7:00 am

టైటిల్ చదివే ఆశ్చర్యపోయారు కదా. ఇంకా దాని గురించి మొత్తం తెలుసుకుంటే అవాక్కవ్వాల్సిందే మీరు. నిజానికి ఈ భూమ్మీద ఎన్నో వింతలు, విశేషాలు, ఎన్నో అంతుచిక్కని రహస్యాలు. సైన్స్ కు కూడా అంతపట్టని రహస్యాలు ఎన్నో దాగి ఉన్నాయి. వాటిలో ఒకటి ఈ బిజ్లీ మహదేవ్ గుడి. ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే.. ఈ గుడిలో ఉన్న శివలింగం ముక్కలు అయినా కూడా వెంటనే తిరిగి అతుక్కొని మామూలు శివలింగంలా మారుతుంది. దీని అసలు రహస్యం ఏంటో తెలియక.. శాస్త్రవేత్తలే కాదు.. ఎందరో నిపుణులు, ఆధ్యాత్మిక వేత్తలు కూడా ఆశ్చర్యపోతున్నారు. దాని అసలు రహస్యం ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది.

bijli mahadev temple in himachal pradesh

bijli mahadev temple in himachal pradesh

ఇంతకీ ఈ గుడి ఎక్కడుంది అంటారా? మన ఇండియాలోనే. హిమాచల్ ప్రదేశ్ లోని కుల్లు అనే ప్రాంతంలో ఉంది. కుల్లులోని ఓ పేద్ద కొండ మీద 2460 మీటర్ల ఎత్తులో ఉంటుంది ఈ శివాలయం. ఈ శివాలయాన్ని చేరుకోవాలంటే.. యాత్రికులు కానీ.. భక్తులు కానీ ట్రెక్కింగ్ చేయాల్సిందే. బిజ్లీ మందిరంలో ఉన్న శివలింగంపై పిడుగుపడి శివలింగం ముక్కలు అవుతుందట. ఆ తర్వాత తెల్లారి ఆ శివలింగం అతుక్కుని ఇదివరకు ఉన్న శివలింగంలా మారుతుందట. ఇలా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందట.

12 ఏళ్లకు ఒకసారి పిడుగు పాటుకు గురవుతున్న గుడి

12 ఏళ్లకు ఒకసారి ఆ గుడిలో పిడుగు పడుతుందట. దీంతో శివలింగం మాత్రం ముక్కలు అవుతుందట. గుడికి మాత్రం ఎటువంటి పగుళ్లు ఏర్పడవు. కేవలం శివలింగం మాత్రమే ముక్కలు అవుతుంది. ఆ తర్వాత తెల్లారి పూజారులు గుడికి వెళ్లి.. ముక్కలయిన శివలింగాన్ని ఒక్కచోట చేర్చి అభిషేకం చేస్తారు. అభిషేకం చేసిన తర్వాత తెల్లారి ఆ శివలింగం తన యథారూపంలోకి వచ్చేస్తుంది. ఇది మాత్రం 12 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే జరిగే అద్భుతం.

bijli mahadev temple in himachal pradesh

bijli mahadev temple in himachal pradesh

అయితే.. ఇలా 12 ఏళ్లకు ఒకసారి శివుడి లింగం మీద పిడుగు పడటం వెనుక ఒక కథ కూడా ఉంది. పూర్వం కుల్లు వ్యాలీలో ఒక రాక్షసుడు ఉండేవాడట. ఆ రాక్షసుడు అక్కడ నివసించే ప్రజలను, పశువులను నాశనం చేయడం కోసం.. పెద్ద సర్పంలా మారి.. అందరి చంపుకుంటూ వెళ్లేవాడట. అక్కడ ఉన్న బియాస్ నదికి అడ్డంగా ఉండి.. అక్కడి ప్రజలను ఆ నదిలో ముంచి చంపేందుకు ప్రయత్నిస్తుండేవాడట. ఈ విషయం పరమశివుడికి తెలిసి.. తన త్రిశూలంతో శివుడు.. ఆ రాక్షసుడిని సంహరించాడు. అయితే.. ఆ రాక్షసుడు చనిపోయాక.. అక్కడే పెద్ద కొండగా మారాడట. అలా ఈ కొండ ఏర్పడిందని నమ్మకం. అయితే.. ఈ కొండ వల్ల భవిష్యత్తులో ప్రజలకు ఎటువంటి ఆపద రాకూడదని.. శివుడు కూడా అదే కొండ మీద వెలిశాడని అక్కడి ప్రజలు నమ్ముతారు. అయితే.. ఆ రాక్షసుడిని సంహరించడానికి.. ఆ కొండ మీద పిడుగును వేయాలని.. ఇంద్రుడిని శివుడు ఆదేశించాడట. అయితే.. పిడుగు కొండ మీద ఎక్కడ పడితే అక్కడ వేస్తే.. ప్రజలు, పశువులు చనిపోతాయి కాబట్టి.. ఆ పిడుగును తన శివలింగం మీద వేయాలని ఆదేశించాడట. అలాగే.. 12 ఏళ్లకు ఒకసారి.. శివుడి ఆదేశం మేరకు.. శివుడి లింగం మీద పిడుగు పడుతుందని నమ్మకం. అందుకే మళ్లీ ఆ శివలింగం తెల్లారి అతుక్కుంటుదని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది