
#image_title
Holidays | దసరా, దీపావళి సెలవుల సందడి ముగిసినప్పటికీ విద్యార్థులు ఇంకా హాలిడే మూడ్‌లోనే ఉన్నారు. అక్టోబర్ నెలలో పండుగలతో పాటు భారీ వర్షాల కారణంగా విద్యాసంస్థలకు వరుసగా సెలవులు లభించాయి. ఇప్పుడు నవంబర్ నెల మొదలవడంతో మరోసారి విద్యార్థులు, ఉద్యోగులు సెలవుల లెక్కలు వేసుకుంటున్నారు. ముఖ్యంగా నవంబర్ తొలి వారంలోనే వరుస హాలిడేలు రావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
#image_title
సెలవులే సెలవులు..
నవంబర్ 2వ తేదీ ఆదివారం కావడంతో ఆ రోజు సాధారణ సెలవు. ఆ తర్వాత నవంబర్ 5న కార్తీక పౌర్ణమి సందర్భంగా విద్యాసంస్థలకు సెలవు ఉండే అవకాశం ఉంది. ఇదే రోజున గురునానక్ జయంతి కూడా. రెండు పండుగలు ఒకే రోజున రావడంతో చాలా ప్రాంతాల్లో అధికారికంగా హాలిడే ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. తర్వాతి వారాంతంలో కూడా విద్యార్థులకు విశ్రాంతి లభించనుంది. నవంబర్ 8న రెండో శనివారం , నవంబర్ 9న ఆదివారం . దీంతో ఈ రెండు రోజులు కూడా సెలవులు ఉండటంతో మొత్తం మీద నవంబర్ 2, 5, 8, 9 తేదీల్లో విద్యార్థులకు వరుసగా నాలుగు సెలవులు దక్కుతున్నాయి.
అంతే కాదు, ఈ నెలలో అనధికారిక సెలవులు వచ్చే అవకాశం కూడా ఉంది. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ “ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇన్‌స్టిట్యూషన్స్” ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచింది. నవంబర్ 1లోపు బకాయిలు విడుదల చేయకపోతే, నవంబర్ 3 నుంచి నిరవధికంగా విద్యాసంస్థల బంద్ చేపడతామని హెచ్చరించింది.ఈ సమ్మె నిజంగా ప్రారంభమైతే నవంబర్‌లో విద్యార్థులకు అదనంగా మరికొన్ని రోజులు సెలవులు రావడం ఖాయం.
Apple | రోజూ ఒక యాపిల్ తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం ఉండదు” ఈ మాట మనందరికీ బాగా…
Rose Petals | గులాబీ పువ్వులు అందం, సువాసనకు ప్రతీకగా నిలుస్తాయి. కానీ ఈ సుగంధ పువ్వులు కేవలం అలంకరణకు మాత్రమే…
Ivy gourd | మన రోజువారీ ఆహారంలో కూరగాయలకు ప్రత్యేక స్థానం ఉంది. వీటి ద్వారా శరీరానికి అవసరమైన విటమిన్లు, మినరల్స్,…
November | నవంబర్ నెల చలికాలం ఆరంభమయ్యే ఈ సమయం ప్రకృతిలో మార్పులు తీసుకురావడమే కాదు, ఈ నెలలో జన్మించిన…
Capsicum | శీతాకాలం వచ్చేసింది. ఈ సీజన్లో చలి మాత్రమే కాదు, అనేక రకాల ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి.…
Poha | ప్రతిరోజూ ఒకే రకం ఆహారం తింటూ బోర్ ఫీల్ అవుతున్నారా? అలాంటప్పుడు మీ మెనూలో అటుకులు (పోహా) ని…
Amla Juice | ఉదయం మనం తినే మొదటి ఆహారం శరీరంపై పెద్ద ప్రభావం చూపుతుంది. అందుకే వైద్య నిపుణులు…
Mint Leaves | వంటల్లో రుచిని, సువాసనను పెంచే పుదీనా ఆకులు ఆరోగ్యానికి కూడా అనేక విధాలుగా ఉపయోగకరమని వైద్య…
This website uses cookies.