Lovers : స్నేహితులుగా ఉండి తర్వాత భగ్న ప్రేమికులుగా మారే సందర్భాలేంటో మీకు తెలుసా..!
Lovers : ప్రేమ, స్నేహం… ఈ రెండింటి మధ్య తేడా అతి కొద్ది మందికి మాత్రమే తెలుస్తుంది. మీకు తెలుసో తెలియదో… స్నేహితులుగా ఉన్న ఒక అమ్మాయి, అబ్బాయిల మధ్య ప్రేమ చిగురించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్కూల్లో చదువుకునేటప్పుడు కలిసి తిరిగిన ఫ్రెండ్స్ ను పెళ్లి చేసుకున్న వారి సంఖ్య బోలెడు. బాల్యంలో ప్రేమ అనే మాటలకు సరైన అర్థం తెలియకపోవచ్చు. కానీ క్రమక్రమంగా ఏళ్ల తరబడి ఫ్రెండ్స్ లా కొనసాగుతూ ఉన్నప్పుడూ ఆ స్నేహం కొన్ని సార్లు ప్రేమకు దారి తీస్తుంది. అయితే ఈ ప్రేమ అనేది ఎప్పుడు, ఎక్కడ పుడుతుందో.. ఎవ్వరూ చెప్పలేరు. కొందరు తొలి చూపులోనే ప్రేమ పుడితే.. మరి కొందరు ఏళ్ల తరబడి ఫ్రెండ్స్ లా కొనసాగుతూ ఆలస్యంగా ప్రేమలో పడతారు. అయితే ఒక స్నేహం ఎలాంటి సందర్భాల్లో ప్రేమకు దారి తీస్తుందో తెలుసుకోవాలని ఉందా ఇంకెందుకు ఆలస్యం పదండి.
Lovers : ఒకరినొకరు అర్థం చేసుకోవడం ద్వారా
ఏ ఇద్దరైన ఒక స్నేహ బంధంలో ఉన్నపుడు ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. వాస్తవానికి ఎదుటి వారు మనకు బాగా నచ్చడం వల్లే వాళ్ళని మనం బెస్ట్ ఫ్రెండ్స్ లా భావిస్తాం. అదే ఓ స్నేహబంధంలో ఉన్న అమ్మాయి, అబ్బాయిలను ప్రేమలో పడేలా చేస్తుంది. వారివురీ అభిప్రాయాలు మ్యాచ్ కావడంతో వారి మనసులు కూడా ఒక్కటవుతాయి.
Lovers : మీ ఫ్రెండ్ మిమ్మల్ని కల్లో కూడా వదలట్లేదా
ఏ సందర్భం లోనైతే మీ బెస్ట్ ఫ్రెండ్ ను మీరు విడిచి పెట్టి ఉండలేక పోతున్నారో, వారిని చూడకుండా మీకసలు ఏ పని తోచక పోతే కూడా మీరు వారితో ప్రేమలో పడ్డట్టే. మీకు తెలియకుండానే ఓసారి మీ బెస్ట్ ఫ్రెండ్ తో ప్రేమ ప్రయాణంలో అడుగు పెట్టకా.. ఇక అనునిత్యం వారి గురించే ఆలోచనలు వస్తుంటాయి. పగలు, రాత్రి తేడ లేకుండా మీరు అనుకుంటున్న మీ బెటర్ హాఫ్ ను కలవలేక ఉండలేకపోతారు. మరో విషయం ఏమిటంటే ఓసారి ప్రేమలో పడ్డాకా.. ఇద్దరి మధ్య మాటలు తగ్గి, ఒకరినొకరు చూసుకుంటూ సిగ్గు పడడం ఎక్కువై పోతుంది.
Lovers ప్రేమలో పడ్డారని అసలు మీకైన తెలుసా
ఒక్కోసారి స్నేహ బంధంలో ఉన్న ఇద్దరు..వారికి తెలియకుండానే ఒకరితో మరొకరు ప్రేమలో పడతారు. ఆ విషయం వారే స్పష్టంగా తేల్చుకోలేక… ఓసారి ఫిక్స్ అయినా ఒకరితో ఒకరు చెప్పుకోలేక సతమతమవుతూ ఉంటారు. ఒకవేళ చెబితే తమ మధ్య ఉన్న స్నేహ బంధం దెబ్బ తింటుందేమోనన్న అయోమయంలో కొంతమంది వెనకడుగు వేస్తుంటారు.
Lovers ఇద్దరే ఏకాంతంగా గడిపిన సమయంలో:
ఓ కార్యక్రమానికో, సినిమాకో, పార్క్ కో వెళ్ళేముందు మనకు ఎంత మంది ఫ్రెండ్స్ ఉన్నా ఒక్కోసారి అందరూ హ్యాండ్ ఇస్తూ ఉంటారు. ఇలాంటి సమయంలో ఉన్న ఆ ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ కలిసి వెళ్లాల్సి ఉంటుంది. ఎప్పుడూ కొట్టుకు తిరిగే ఆ ఇద్దరూ.. ఇలాంటి సందర్భాల్లోనే ప్రేమలో పడతారు.
Lovers మనసులోని ప్రేమ మాటను చెప్పేయండిలా:
ఒక బెస్ట్ ఫ్రెండ్ గా… మీ ఫ్రెండ్ కు ఎది బాగా నచ్చుతుందో మీకే బాగా తెలుసు. వారు ఎప్పుడు బాగా సంతోష పడతారో, వారికి బాగా నచ్చిన ప్లేస్ ఎదో మీకంటే బాగా ఎవరూ చెప్పలేరు. అలాంటి ప్లేస్ కు తీసుకెళ్లి వారి మూడ్ బాగున్న సమయంలో మీ మనసులోని ఆ మూడు ముక్కల్ని ధైర్యంగా చెప్పేస్తే… మీ ప్రేమను వారు కచ్చితంగా కాదనరు. అనంతరం మీ మధ్య ఉన్న ఆ స్నేహ బంధం కాస్త ప్రేమ బంధంగా మారిపోవడం ఖాయం.