Lovers : బైక్ మీద ప్రేమ జంట వెక్కిలి చేష్టలు.. తిక్క కుదిర్చిన పోలీసులు ఏకంగా రూ.53,500 జరిమానా.. వీడియో !
ప్రధానాంశాలు:
Lovers : బైక్ మీద ప్రేమ జంట వెక్కిలి చేష్టలు.. తిక్క కుదిర్చిన పోలీసులు ఏకంగా రూ.53,500 జరిమానా.. వీడియో !
బైక్ పై రొమాన్స్.. బెండు తీసిన పోలీసులు
Lovers : ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేపై ఇద్దరు యువతి-యువకులు చేసిన ప్రవర్తన ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఒక బైక్‌పై యువకుడు బైక్ నడుపుతూ ఉండగా, యువతి అతని ముందుగా పెట్రోల్ ట్యాంక్‌పై రివర్స్‌గా కూర్చొని ప్రయాణించడం కంటబడింది. అంతే కాకుండా ఇద్దరూ హెల్మెట్లు ధరించకపోవడం, బహిరంగ ప్రదేశంలో అసభ్యంగా ప్రవర్తించడం ఈ వ్యవహారాన్ని మరింత తీవ్రతరం చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

Lovers : ప్రేమ జంట బైక్ మీద వెక్కిలి చేష్టలు.. తిక్క కుదిర్చిన పోలీసులు ఏకంగా రూ.53,500 జరిమానా..!
Lovers : బైక్ పై రోమాన్స్ లో మునిగిపోయిన జంట.. పోలీసులు ఏంచేసారో తెలుసా..?
వీడియోను గమనించిన నోయిడా ట్రాఫిక్ పోలీసులు వెంటనే స్పందించి సీసీటీవీ ఫుటేజీ ద్వారా వాహనాన్ని గుర్తించారు. మోటారు వాహన చట్టంలోని పలు సెక్షన్ల ప్రకారం రూ.53,500 జరిమానా విధించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణించడం, ప్రమాదకరంగా బైక్ నడపడం, పబ్లిక్ ప్రదేశంలో అసభ్య ప్రవర్తన చేయడం వంటి కారణాల వల్ల ఈ జరిమానా విధించారని డీసీపీ ట్రాఫిక్ లకన్ సింగ్ యాదవ్ తెలిపారు. ఇది నోయిడా సెక్టార్ 39 పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఘటన.
ఈ సంఘటనను దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్ పోలీసులు ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు. రోడ్లపై నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఒకరి నిర్లక్ష్య ప్రవర్తన వల్ల ఇతరుల ప్రాణాలకూ ముప్పు కలిగే అవకాశం ఉందని హెచ్చరించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల కోసం పాపులారిటీ కోసం చేయబడే ఇలాంటి చర్యలు చట్టపరమైన పరిణామాలకు దారితీస్తాయని పోలీసులు హెచ్చరించారు.
నోయిడాలో బైక్ మీద వెక్కిలి చేష్టలు..
రూ.53500 చలానా వేసిన పోలీసులు#Noida #Police #UANow #UttarPradesh pic.twitter.com/kYJ027z7HZ
— ఉత్తరాంధ్ర నౌ! (@UttarandhraNow) June 17, 2025