Chandrababu : పార్లమెంట్ సాక్షిగా బయటపడిన చంద్రబాబు దొంగ డ్రామాలు.. అప్పుల్లో అప్పటి ప్రభుత్వమే టాప్ – జగన్ చేసింది చాలా తక్కువ..?
Chandrababu : ఏపీలో సంక్షేమ పథకాలు భారీగానే అమలవుతున్నాయి. ప్రతి ఇంట్లో ఎవరో ఒకరికి ఏదో ఒక విధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు అవుతూనే ఉన్నాయి. కానీ.. ఆ సంక్షేమ పథకాల పేరుతో ప్రభుత్వం ఎంత అప్పు చేస్తుందో చాలామందికి తెలియదు. దాని వల్ల అప్పు ప్రతి సంవత్సరం పెరుగుతూ పోతోంది.. అంటూ ప్రతిపక్ష టీడీపీ పార్టీ తెగ విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. చంద్రబాబు హయాంలో అప్పులు తేకుండానే పాలన చేశారా? ఆయన తెచ్చిన అప్పులతో పోల్చితే అసలు ఇవేమీ ఎక్కువ కాదు అంటూ వైసీపీ నేతలు..
టీడీపీకి కౌంటర్లు వేస్తున్నారు.అసలు నిజంగా అప్పులు ఎవరు చేశారు. ఎవరి హయాంలో అప్పులు పెరిగాయి అనేదానిపై కేంద్రమే స్పష్టత ఇచ్చింది. అసలు ఏపీలో ఎన్ని అప్పులు ఉన్నాయో కేంద్రం క్లారిటీ ఇచ్చింది. బడ్జెట్ లో ఇచ్చిన వివరాల ప్రకారం చేసిన అప్పులను తాజాగా వెల్లడించింది. దీంతో అసలు ఏమేరకు ఉన్నాయో తెలిసిపోయింది. దీని గురించి ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి వెల్లడించారు. ప్రస్తుతం ఏపీలో అప్పుడు 3.6 లక్షల కోట్లు ఉంది. నిజానికి.. 2018 లో అప్పటి టీడీపీ ప్రభుత్వం చేసిన అప్పు రూ.2.29 లక్షల కోట్లుగా ఉండేది.
Chandrababu : ప్రస్తుతం ఏపీలో ఉన్న అప్పు ఎంతంటే?
కానీ.. ఇప్పుడు ఆ అప్పు పెరిగింది కానీ తగ్గలేదు. 2017 – 18 ఆర్థిక సంవత్సరంలో 9.8 శాతం అప్పులు తగ్గాయి. కానీ.. 2020-21 నాటికి మాత్రం 17.1 శాతం మాత్రం పెరుగుదల ఉన్నట్టు కేంద్రం చెప్పింది. గత మూడేళ్లుగా అప్పులు పెరుగుతూ పోతున్నాయట. ఏపీ స్థూల జాతీయోత్పత్తితో పోల్చితే 2021 నాటి అప్పులు 36.5 శాతంగా ఉన్నాయి. ఇవన్నీ కేవలం బడ్జెట్ ప్రకారం చూస్తే నమోదైన వివరాలు మాత్రమే. బడ్జెట్ తో సంబంధం లేని అప్పులు కూడా చాలా ఉన్నాయి కానీ.. వాటికి సంబంధించిన వివరాలేవీ పార్లమెంట్ వద్ద లేవు.