7th Pay Commission : సెవెన్త్ పే కమిషన్ ప్రకారం.. ఒక్కో ఉద్యోగికి కనీసం ఎంత జీతం పెరగనుందో తెలుసా?
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతోంది. త్వరలో సెవెన్త్ పే కమిషన్ ప్రకారం ఉద్యోగులకు ఫిట్ మెంట్ పెరగనుంది. ఒకవేళ ఫిట్ మెంట్ పెరిగితే.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కనీసం ఎంత జీతం పెరగనుంది అనేది చాలా మందికి తెలియదు. ఒక్కసారి ఫిట్ మెంట్ పెరిగితే.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి జీతం ఆటోమెటిక్ గా పెరుగుతుంది.అయితే.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ యూనియన్స్ మాత్రం ప్రస్తుతం ఉన్న కనీస జీతం రూ.18 వేల నుంచి రూ.26 వేలకు పెంచాలని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.
అంటే.. ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ ను ప్రస్తుతం ఉన్న 2.57 నుంచి 3.68 కు పెంచాలి.ఒకవేళ ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నట్టుగా 3.68 శాతానికి కేంద్రం ఫిట్ మెంట్ ఇస్తే.. ప్రతి ఉద్యోగి జీతం కనీసం 8 వేలు పెరగనుంది. అంటే.. ప్రస్తుతం ఉన్న కనీస వేతనం 18 వేల నుంచి రూ.26 వేలకు పెరగనుంది. కనీస వేతనం 18 వేలు ఉన్నవాళ్లకు.. అన్ని అలవెన్స్ లతో కలిపి రూ.46,260 జీతం వస్తుంది. అది 2.57 ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ తో.
7th Pay Commission : 3.68 ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ తో అయితే ఎంత పెరుగుతుందో తెలుసా?
ఒకవేళ 3.68 ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ ప్రకారం.. అన్ని అలవెన్సులతో కలిపి జీతం రూ.95,680 అవనుంది. జూన్ 2017లోనే 34 మాడిఫికేషన్స్ తో యూనియన్ కాబినేట్ సెవెన్త్ పే కమిషన్ ను ఓకే చేసింది. దాని ప్రకారం.. హైఎస్ట్ లేవల్ లో పని చేస్తున్న సెక్రటరీ లాంటి ఉద్యోగులకు రూ.2.5 లక్షల జీతం వస్తోంది. క్లాస్ వన్ ఉద్యోగులకు జీతం రూ.56,100 గా ఉంది.