ఇది తెలియక స్త్రీపై పురుషుడు ఇలా చేస్తున్నాడు.. జీవిత సత్యం తెలుసుకోండి
ఇది తెలియక చాలామంది భర్తలు భార్యపై అరుస్తుంటారు. ప్రతి విషయంలో భార్యపై అరుస్తుంటారు. చుట్టూ ఎంతమంది ఉన్నారని కూడా చూడకుండా చాలామంది అరిచేస్తూ ఉంటారు. అయితే.. భర్తలు అలా అరవకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం రండి. మీ భర్త మీపై అరుస్తున్నారు అంటే దానిని మీరు అంగీకరించడం లేదు అనే విషయాన్ని వారికి మీరే తెలియజేయాలి. అరవడం కరెక్ట్ కాదు అనే విషయాన్ని వారికి తెలియజేయాలి.
అలా అన్నింటికీ అరవడం వల్ల సమస్యకు పరిష్కారం దొరకదు అనే విషయాన్ని వారికి చెప్పాలి. ఈ విషయంలో బౌండరీస్ సెట్ చేయాలి. మీ భర్త మీపై ఏ విషయంపై అరుస్తున్నాడు అనే విషయాన్ని మీరు ముందుగా తెలుసుకోవాలి. ఆ సమస్యను పరిష్కరించే దిశగా పనిచేయాలి. దానికోసం ఇద్దరూ కలిసి పనిచేయాలి. మనం మాట్లాడే మాటలు, ఉపయోగించే పదాలు కూడా సమస్యను పరిష్కరిస్తాయట. నువ్వు ఎప్పుడూ నా మీద అరుస్తూనే ఉంటావు అనే బదులు..
మాట్లాడే మాటలే సమస్యను పరిష్కరిస్తాయి
నువ్వు అరుస్తుంటే నాకు బాధ కలుగుతోంది అని చెప్పడం మంచి మార్గం. ఇలా చెప్పడం వల్ల మీరు ఎంత బాధపడుతున్నారనే విషయం వారికి అర్థం అవుతుంది. చాలామంది మహిళలు చేసే పొరపాటు ఇది. మీ భర్త అరవగానే వెంటనే రియాక్ట్ అయి వారితో వాదనకు దిగుతూ ఉంటారు. అలా కాకుండా.. వారు ఎంత అరిచినా మీరు ప్రశాంతంగా ఉండటం వల్ల చాలా సమస్యను పరిష్కరించవచ్చు. ఓపికగా ఉండటం వల్ల గొడవను సద్దుమణిగేలా చేయవచ్చు.