Bridge : పారే నీళ్లపై వంతెనను ఎలా కడతారో తెలుసా…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bridge : పారే నీళ్లపై వంతెనను ఎలా కడతారో తెలుసా…?

 Authored By prabhas | The Telugu News | Updated on :20 July 2022,12:30 pm

Bridge : చాలామందికి ప్రవహించే నీళ్లపై ఎలా వంతెనను నిర్మిస్తారని సందేహం వచ్చే ఉంటుంది. కింద అలా నీళ్లు ప్రవహిస్తున్నప్పుడు భూభాగం లేని చోట వంతెనను కట్టడం మళ్ళీ దానికోసం పిల్లర్లను ఎలా కట్టడం సాధ్యమవుతుంది ఇలా చాలామందికి డౌట్స్ వస్తూ ఉంటాయి. అయితే నీటి స్థాయి, నేల నాణ్యతను బట్టి వివిధ పద్ధతుల ద్వారా నీటిపై వంతెనలను నిర్మిస్తారు. దీని కోసం ఇంజనీర్లు ఎంతో కష్టపడి సరైన ఆలోచనలతో చక్కటి వ్యూహంతో వంతెనలను నిర్మిస్తారు.. మొదటి పద్ధతిలో తక్కువ లోతు నీటిలో వంతెనలను నిర్మిస్తారు. తక్కువ లోతు నీటిలో వంతెన యొక్క పునాదిని తాత్కాలికంగా ఒక నిర్దిష్ట ప్రదేశాన్ని పూరించడం ద్వారా వేయబడుతుంది. దీనిపై స్తంభాలను నిర్మించేస్తారు.

అయితే నీటి అడుగున ఉన్న పొర పలుచగా ఉన్నప్పుడు తాత్కాలికంగా రిగ్గులను ఏర్పాటు చేసి నది గర్భం లో లోతుగా పిల్లర్లను నిర్మిస్తారు. అప్పుడు వంతెనను ఇప్పటికే నిర్మించిన పిల్లర్ సపోర్ట్ తో టెంపరరీ ప్లాట్ ఫారం లేదా బాధితుల ద్వారా బ్యార్జ్ లో ద్వారా నిర్మించవచ్చు. ఇక రెండో రెండవ పద్ధతి లోతైన నీటిపై వంతెనను నిర్మించడం. ఇలాంటి నిర్మించేటప్పుడు కాపర్ డ్యాం టెక్నిక్ ను ఉపయోగిస్తారు. ఈ పద్ధతి ద్వారా నీటి లోపల ఒక ప్రదేశాన్ని చుట్టుముట్టి, గోడను నిర్మించి ఆ ప్రదేశం నుండి నీటిని బయటకు పంపించేస్తారు ఆ తర్వాత కాఫర్ డ్యాం లోపల వంతెన పునాది నిర్మించబడుతుంది. ఈ పద్ధతి ఎక్కువగా నదులు, సముద్రాలపై ఉపయోగిస్తారు. వీటిల్లో నీటి ప్రవాహం ఎక్కువగా ఉంటుంది.

How to build bridge in floating water

How to build bridge in floating water

కాబట్టి పని పూర్తి అయ్యేంతవరకు ప్రతిరోజు పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఈ రెండు కాకుండా మరొక పద్ధతి కూడా ఉంది. ఈ సాంకేతికతకు కేసు డ్రిల్లింగ్ అని పేరు. ఇది మోడ్రన్ టెక్నిక్. ఈ టెక్నిక్ లో వాటర్ టైట్ చాంబర్ గాలి ఒత్తిడి సహాయంతో నీటిని దూరంగా ఉంచుతుంది. అప్పుడు ఛాంబర్ లోపల ఉన్న ఒక మూసి ఉన్న ట్యూబ్ చాంబర్ అమర్చబడుతుంది. ఆ తర్వాత ట్యూబ్ లోపల సుదీర్ఘ డ్రీం ఉంచబడుతుంది. మరియు డ్రిల్లింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఈ ప్రక్రియలో నిండిన నీరు బయటకు పంపబడుతుంది. ఆ తరువాత అదనపు మద్దతు ఇవ్వడానికి లోపల డ్రిల్లింగ్ చేయబడిన రంధ్రంలోకి ఒక కేసును పంపిస్తారు. ఈ విధంగా స్థిరమైన ఫ్రేమ్ సృష్టించబడుతుంది. ఇలా వంతెన నీటిపై వంతెనలను నిర్మిస్తారు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది