Viral Video : స్వాతంత్య్రం వచ్చి 75 సం.. అయినా మారని గ్రామాలు.. చదువు కోసం ఇలా వంతెన దాటాల్సిందేనా..?
Viral Video : సాధారణంగా ఏవైనా వాగులు, వంకలు ఉంటే.. వాటి మీది నుంచి రోడ్డు వేయాలంటే ఖచ్చితంగా బ్రిడ్జి వేయాల్సిందే. అందుకే మనం వాగులు, నదులు పారుతున్న చోట పెద్ద పెద్ద బ్రిడ్జిలు వేస్తుంటారు. ఆ బ్రిడ్జిలు లేకపోతే ఎక్కడికక్కడ రాకపోకలు నిలిచిపోతాయి. అయితే.. అన్ని చోట్లా బ్రిడ్జిలు ఉంటాయి అనుకోవద్దు. ఎందుకంటే.. కొన్ని మారుమూల ప్రాంతాల్లో బ్రిడ్జిలు ఉండవు. కొందరైతే వాగులు, వంకలు దాటుతూ అవతలి నుంచి ఇవతలికి వెళ్తారు. వాళ్లకు వేరే ఆప్షన్ ఉండదు. ముఖ్యంగా అడవుల్లో ఉండేవారు, మారు మూల పల్లెల్లో ఉండేవాళ్లకు ఇలాంటి సమస్యలు వస్తుంటాయి.
కొందరు తాత్కాలికంగా అలాంటి వాగులు దాటడం కోసం సొంతంగా ఏవైనా కర్రలు, తాడుతో బ్రిడ్జి నిర్మించుకుంటారు. కానీ.. అవి ఏమాత్రం సేఫ్ కాదు. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మధ్యప్రదేశ్ లోని అశోక్ నగర్ జిల్లాలో ఈ బ్రిడ్జి ఉంది. అది తాడుతో చేసిన వంతెన. దాన్ని చూసి మాత్రం ఎవ్వరూ దాన్ని దాటడానికి ప్రయత్నాలు చేయరు. అంత డేంజర్ వంతెన అది. ఏమాత్రం అటూ ఇటూ అయినా ఆ వంతెన మీది నుంచి నీటిలో పడాల్సిందే.అయితే.. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అయినా ఇంకా గ్రామాల్లో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయా అని ఆశ్చర్యం కలుగుతుంది.
Viral Video : త్రివేణి నది దాటాలంటే ఈ వంతెనను దాటాల్సిందే
కానీ.. మధ్యప్రదేశ్ లోని అశోక్ నగర్ జిల్లా తూమెన్ గ్రామంలో ఏ పని కోసం అయినా ఆ వంతెన దాటాల్సిందే. విద్యార్థులు, వృద్ధులు అయితే ఆ వంతెనను బిక్కుమంటూ దాటుతున్నారు. ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని వంతెన దాటుతున్నారు. ఆ వంతెన ఎంత దారుణంగా ఉందో.. అసలు ఇలాంటి వంతెనలు ఇంకా ఉన్నాయా అని ఈ వీడియో చూస్తే అర్థం అవుతుంది. తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు అయినా మారని గ్రామాలు
మధ్యప్రదేశ్లోని – అశోక్ నగర్ జిల్లా తూమెన్ గ్రామంలో విద్యార్థులు చదువు కోసం తమ ప్రాణాలనే పణంగా పెడుతున్నారు. ప్రమాదకరంగా ఉన్న తాడు వంతెనను ఆధారంగా చేసుకొని త్రివేణి నది దాటుతూ పాఠశాలకు వెళుతున్నారు. pic.twitter.com/sET1JnB6rU
— Telugu Scribe (@TeluguScribe) July 22, 2023