Chicken 65 : నాన్ వెజ్ అనగానే ఎక్కువగా గుర్తొచ్చేది చికెన్. చికెన్ అనే పేరు వింటే చాలు నోరూరుతుంటుంది. చికెన్ ను ఇష్టపడనివారు ఉండరు.అయితే మనం రెస్టారెంట్ కి వెళ్లినప్పుడు చికెన్65 ను తింటుంటాం. అబ్బా..ఎంత బాగుందో అనుకుంటూ తింటాం. ఎలాగైనా ఈ చికెన్65 ను ఇంట్లో చేయాలని ట్రై చేస్తాం. కాని రెస్టారెంట్ లో లాగా రాదు. రెస్టారెంట్ వారు వివిధ రకాల ఐటెమ్స్ వాడుతారు. కాబట్టి చికెన్65 అంత టేస్టీగా, స్పైసీగా వుంటుంది. ఇప్పుడు రెస్టారెంట్ స్టైల్ చికెన్65 ను ఎలా తయారుచేసుకోవాలో, దానికి కావలసిన పదార్ధాలు ఏంటో తెలుసుకుందాం…
కావలసిన పదార్దాలు: 1)చికెన్ 2)అల్లం 3)ధనియాల పొడి 4)జిలకర్ర పొడి 5) ఉప్పు 6)పసుపు 7)పెరుగు 8)కరివేపాకు 9)కారం 10)జొన్నపిండి 11)ఫుడ్ కలర్ 12)నిమ్మకాయ 13)పచ్చిమిర్చి14) ఆయిల్ తయారీ విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని శుభ్రంగా కడుక్కున్న 300 గ్రాముల చికెన్ ను తీసుకోవాలి.అందులోకి ఒక టీ స్ఫూన్ అల్లం, ఒక టీ స్పూన్ ధనియాల పొడి, ఒక టీ స్ఫూన్ జిలకర్ర పొడి,చిటికెడు పసుపు, తగినంత ఉప్పు,ఒక టీ స్ఫూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి.తరువాత కొన్ని కరివేపాకులు, కొద్దిగా జొన్నపిండి వేసుకొని బాగా కలుపుకోవాలి. తరువాత కొద్దిగా పెరుగు,కొంచెం ఫుడ్ కలర్ వేసుకొని బాగా కలుపుకోవాలి.
కొద్దిగా నిమ్మకాయను పిండుకొని మళ్లీ బాగా కలుపుకొని రెండు గంటల పాటు ప్రక్కన పెట్టుకోవాలి. కొద్ది సమయం తరువాత స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ పోసుకొని మ్యారినేట్ చేసుకున్న చికెన్ ముక్కలను వేసుకొని బాగా వేయించుకోవాలి. మళ్లీ రెండోసారి వేయించుకోవాలి. మంచి ఎరుపు రంగులోకి వస్తాయి. తరువాత ఒక ప్లేట్ లోకి తీసుకొని ప్రక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ ఆయిల్ లోనే కొన్ని కరివేపాకులను, కొన్ని పచ్చిమిర్చిలను వేయించుకోవాలి. వీటిని చికెన్ ముక్కలపై గార్లిక్ చేసుకుంటే ఎంతో టేస్టీ,టేస్టీ, స్పైసీ ,స్పైసీ చికెన్65 రెడీ..మీకు మరింత వివరణ కోసం ఈ క్రింది వీడియో లింక్ ను క్లిక్ చేయండి…
Skin Care : ప్రస్తుత కాలంలో మార్కెట్లో చర్మ సంరక్షణ కోసం ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటున్నాయి. అదే టైంలో…
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
This website uses cookies.