Chicken Pakodi Recipe : కేరళ స్టైల్ లో చికెన్ పకోడీని ఇలా చేయండి…
Chicken Pakodi Recipe : ఈ రోజుల్లో నాన్ వెజ్ తినని వారు ఉండరు. అందులో ముఖ్యంగా చికెన్ ను తినని వారు అసలు ఉండరు. చికెన్ లో మంచి మాంసకృత్తులు ఉంటాయి. ఇవి మన శరీరానికి మంచి బలాన్ని చేకూరుస్తాయి. చికెన్ తో కర్రీనే కాకుండా చికెన్ పకోడీని చేసుకుంటే ఎంతో రుచిగా ఉంటాయి. ఈ చికెన్ పకోడీని కేరళ స్టైల్ లో చేసుకుంటే ఆ రుచి మాటల్లో చెప్పలేం. వర్షాకాలంలో చికెన్ పకోడీ ఎప్పుడూ చేయని విధంగా కేరళ స్టైల్ లో చేసుకునే తింటే ఎంతో రుచిగా ఉంటాయి. అయితే ఇప్పుడు చికెన్ పకోడీని కేరళ స్టైల్ లో ఎలా చేసుకోవాలి, దానికి కావలసిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు : 1)చికెన్ 2) మైదాపిండి 3) గుడ్లు 4) కారంపొడి 5) ధనియాల పొడి 6) మిరియాల పొడి 7) పసుపు 8) ఉల్లిపాయలు 9) కొత్తిమీర 10)అల్లం, వెల్లుల్లి 11) కరివేపాకు 12)పచ్చిమిరపకాయలు 13) జీలకర్రపొడి 14) గరం మసాలా15) బేకింగ్ సోడా 16) ఉప్పు 17) వాటర్ 18) అసఫోయ్టెడా 19) ఆయిల్ తయారీ విధానం: ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు మైదా, ఒక కప్పు బియ్యం పిండి, మూడు టీ స్పూన్ల జొన్నపిండి, ఒక టీ స్పూన్ కారంపొడి, ఒక టీ స్పూన్ మిరియాల పొడి, రెండు టీ స్పూన్ల ధనియాల పొడి, అర టీ స్పూన్ పసుపు, కట్ చేసిన ఉల్లిపాయలు, ఒక టీ స్పూన్ జీలకర్ర, రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి తురుము, కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఒక టీ స్పూన్ గరం మసాలా, అర టీ స్పూన్ బేకింగ్ సోడా, తురిమిన కొత్తిమీర కొద్దిగా, సరిపడ ఉప్పు, ఒక టీ స్పూన్ అసఫోయ్టెడా, మూడు గుడ్లు వేసుకోవాలి.
ఇప్పుడు వాటిలో నీరు పోసి బాగా కలుపుకోవాలి. తర్వాత అందులో 350 గ్రాములు చికెన్ ముక్కలను వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో రెండు టీ స్పూన్ల వెనిగర్ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకొని ఫ్రిడ్జ్ లో 30 నిమిషాలు దాకా పెట్టాలి. తర్వాత ఒక పెనం తీసుకొని అందులో కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక మనం ముందుగా తయారు చేసుకున్న చికెన్ మిశ్రమాన్ని పకోడీ లాగా వేయాలి. ఇలా వేసుకున్న తర్వాత అవి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి. తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని వేసుకుంటే చికెన్ పకోడీలు తయారైనట్లే. ఎంత ఎంతో రుచిగా ఉండే ఈ చికెన్ పకోడీని సాయంత్రం వేళల్లో వేడివేడిగా తింటే ఎంతో రుచిగా ఉంటాయి.