Chicken Pakodi Recipe : చికెన్ పకోడీ కరకరలాడుతూ నూనె పీల్చకుండా బండిమీద టేస్ట్ రావాలంటే.. ఇలా ట్రై చేయండి…!
ప్రధానాంశాలు:
Chicken Pakodi Recipe : చికెన్ పకోడీ కరకరలాడుతూ నూనె పీల్చకుండా బండిమీద టేస్ట్ రావాలంటే.. ఇలా ట్రై చేయండి...!
Chicken Pakodi Recipe : చికెన్ పకోడీ పేరు వింటుంటేనే నోట్లో నీళ్లు వస్తున్నాయా.. చేసుకునే తింటే పక్కవాళ్ళకి ఒక్క ముక్క కూడా పెట్టాలనిపించింది. అంత టేస్టీగా ఉంటుందన్నమాట.. పర్ఫెక్ట్ కోలతలతోస్ట్రీట్ స్టైల్ లో చికెన్ పకోడీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను.. ఈ కొలతలతో ఈ విధానాల్లో గనుక మీరు చికెన్ పకోడీ చేస్తే ముక్కలు అనేవి ఆయిల్ అసలు పీల్చవు.. క్రిస్పీ క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి. తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేయండి. మరి లేట్ చేయకుండా ఈ చికెన్ పకోడీ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం.. దీనికి కావలసిన పదార్థాలు: చికెన్, కారం, ఉప్పు, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, మిర్యాల పొడి, గరంమసాలా, నిమ్మరసం, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఆయిల్ మొదలైనవి.. తయారీ విధానం: ఇక్కడ హాఫ్ కేజీ దాకా బోన్ లెస్ చికెన్ తీసుకొవాలి.. ఈ చికెన్ మొత్తాన్ని కూడా శుభ్రంగా ఉప్పు వేసి రెండు మూడు సార్లు పాటు బాగా వాష్ చేసుకోండి. ఆ తర్వాత వాటర్ లేకుండా శుభ్రంగా ముక్కలు మాత్రమే తీసుకొని ఒక బౌల్ లోకి పెట్టుకోండి.
ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు ,పావు టీస్పూన్ దాకా పసుపు అలాగే ఒక అరబద్ధ నిమ్మ రసం పిండుకొని ఇందులో వేసుకోండి. కనీసం ఒక రెండు నిమిషాల పాటు బాగా ఈ ముక్కల్ని కలుపుతూ మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి రెండు టీ స్పూన్ల కారం, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, ఒక టీ స్పూన్ల ధనియాల పొడి, అర టీ స్పూన్ మిరియాల పొడి, రెండు టీ స్పూన్ల గరం మసాలా పౌడర్, రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా చికెన్ కి బాగా పట్టేటట్టుగా బాగా మిక్స్ చేసుకోండి. ఇందులోకి కొంచెం కలర్ ఫుల్ గా కనిపించడం కోసం రెడ్ ఫుడ్ కలర్ ని చిటికెడంత వేసుకోవచ్చు… చికెన్ మొత్తాన్ని ఇలా మిక్స్ చేసేసుకొని పెట్టేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, ఒక టేబుల్ స్పూన్ రైస్ ప్లోర్,రెండు టేబుల్ స్పూన్ల శెనగపిండి ఇవి వేస్తే సరిపోతుంది. తర్వాత ఈ పిండిని కూడా బాగా చికెన్ కి పట్టించండి. అవసరమైతే కొంచెం వాటర్ వేసుకుని ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా బాగా కలుపుకోండి. పుదీనా కొద్దిగా అలాగే కొంచెం కరివేపాకు వేయండి. అండ్ కొంచెం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోండి.
ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాక ఆయిల్ వేసి వీటన్నిటిని కూడా మళ్లీ తిరిగి ఒకసారి బాగా కలుపుకోండి. కనీసం ఒక గంట పాటు మనం ఫ్రిజ్లో పెట్టుకోవాలి. మీరు ఎంత సేపు చికెన్ మ్యారినేట్ చేస్తే చికెన్ పకోడా అంత టేస్టీగా వస్తుంది. తర్వాత చికెన్ బయటికి తీసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పై కడాయి పెట్టి దాంట్లో ఆయిల్ డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ పోసి ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వండి.. ఆయిల్ హీట్ అయిన తర్వాత అ కొద్ది కొద్దిగా చికెన్ పీసెస్ ని విడివిడిగా వేస్తూ ఈవెన్ గా క్రిస్పీగా అయ్యేంతవరకు బాగా ఫ్రై చేసుకుని ఆ తర్వాత పక్కకు తీసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుంటేనే మీకు పైన క్రిస్పీగా వస్తాయి. లోపల టెండర్గా చికెన్ అనేది మంచిగా ఉడుకుతుంది. ఈవెన్గా ఫ్రై చేసుకున్న తర్వాత వేడివేడిగా పక్కకు తీసుకొని ఉల్లిపాయ ఇంకా నిమ్మకాయతో సర్వ్ చేసుకోండి. టేస్టీ టేస్టీ చికెన్ పకోడీ అనేది రెడీ అయిపోతుంది. ఈసారి నెక్స్ట్ టైం మీరు చికెన్ పకోడీ చేసేటప్పుడు ఈ ప్రాసెస్ లో చేయండి. మీ ఇంట్లో వాళ్లందరికీ కూడా తప్పకుండా నచ్చుతుంది.