Avakaya Chicken Curry : ఆవకాయ కోడి కూర ఇలా చేశారంటే… రుచి అమోఘం… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Avakaya Chicken Curry : ఆవకాయ కోడి కూర ఇలా చేశారంటే… రుచి అమోఘం…

 Authored By prabhas | The Telugu News | Updated on :21 July 2022,11:00 am

Avakaya Chicken Curry : ఈరోజుల్లో నాన్ వెజ్ ను తినని వారు ఉండరు. ఇప్పుడు రుచుల కోసం వివిధ రకాల పద్ధతిలో చేస్తున్నారు. అయితే చికెన్ ను ఆవకాయ లాగా పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అలాగే ఎంతో రుచిగా కూడా ఉంటుంది. అంతేకాకుండా ఇంటికి ఎవరైనా అకస్మాత్తుగా బంధువులు వచ్చినప్పుడు ఆవకాయకోడి కూర ఉపయోగపడుతుంది. అలాగే వీకెండ్స్ లో కూడా ఆవకాయ కోడి కూరని ఈజీ గా చేసుకోవచ్చు. పచ్చళ్ల పరిమళంతో, స్పైసీగా, పుల్లగా, కారంగా ఈ ఆవకాయ కోడికూరను ఎలా చేసుకోవాలో, దానికి కావలసిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు : 1) చికెన్ 2) పెరుగు 3) పచ్చి మిర్చి 4) ఉల్లిపాయ 5) ఉప్పు 6) జీలకర్ర 7) పసుపు 8) మిరియాల పొడి 9) కారంపొడి 10) ఎండుమిర్చి 11) మెంతులు 12) ఆవాలు 13) ధనియాలు 14) కలోంజి 15) ఆయిల్ 16) కొత్తిమీర 17) కరివేపాకు 18) అల్లం వెల్లుల్లి పేస్ట్. తయారీ విధానం: ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో ఒక కప్పు పెరుగు, ఒక టీ స్పూన్ ఉప్పు, ఒక టీ స్పూన్ వేయించిన జీలకర్ర, పావు టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ మిరియాల పొడి, 2 1/2 టీ స్పూన్ల కారం పొడి వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో 1/2 కేజీ చికెన్ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన దానిని ఒక గంట సేపు ప్రక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చడి కారం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఐదు ఎండుమిర్చిలను వేసి రంగు మారే వరకు వేయించుకోవాలి. తర్వాత ఇందులో పావు టీ స్పూన్ మెంతులు, అర టీ స్పూన్ ఆవాలు వేసి లో ఫ్లేమ్ లో వేయించుకోవాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, అర టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ కలోంజి వేసుకోవాలి.

How to make Avakaya Chicken Curry

How to make Avakaya Chicken Curry

తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మిక్సీ జార్ లోకి తీసుకొని మెత్తగా మిక్సీ పట్టు కొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ లో 6 టేబుల్ స్పూన్ల ఆయిల్ లో వేసి అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర, మూడు ఎండుమిర్చిలను వేసి వేగనివ్వాలి. తర్వాత కరివేపాకు, ఒక కప్పు ఉల్లిపాయలను వేసి గోధుమ రంగు వచ్చేవరకు వేయించుకోవాలి. తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ను వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ వేసి హై ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి. తర్వాత ఇందులో పచ్చడి కారంను కొద్దిగా వేసుకోవాలి. తర్వాత 250మి.లీ వాటర్ ను వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో మధ్య మధ్యలో తిప్పుతూ 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత చివర్లో కొద్దిగా నిమ్మరసం వేసి ముందుగా గ్రాండ్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చడి కారంను, కొద్దిగా కొత్తిమీర, మూడు నాలుగు పచ్చిమిర్చిలను వేసి బాగా కలుపుకోవాలి. అంతే ఎంతో టేస్టీగా ఉండే ఆవకాయ కోడి కూర రెడీ. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ క్రింది వీడియో లింకును క్లిక్ చేయండి.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది