Chicken Curry : రెస్టారెంట్ స్టైల్ లో చికెన్ కర్రీ ఈ స్టైల్లో చేస్తే టేస్ట్ అదిరిపోద్ది…
Chicken Curry : చాలామంది చపాతి, రోటి ,పుల్కాలలో ఎగ్ బుర్జి, టమాటా ఎగ్గు ఇలా సైడ్ డిష్ గా పెట్టుకుని తింటూ ఉంటారు. అలా కాకుండా ఇప్పుడు చపాతి, పుల్కా ,రోటీలలోకి చికెన్ కర్రీ చేసి చూద్దాం… ఇది ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది.. కావాల్సిన పదార్థాలు : చికెన్, జీడిపప్పు, పచ్చిమిర్చి, టమాటాలు, జీలకర్ర, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, ఫ్రెష్ క్రీమ్, ఉల్లిపాయలు, బిర్యానీ ఆకు, బటర్ ,ఆయిల్ మొదలైనవి…
తయారీ విధానం : ముందుగా టమాటా ముక్కలు ఒక కప్పు, ఒక పది జీడిపప్పులు వేసి మెత్తటి పేస్టులా పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పై ఒక కడాయి పెట్టుకుని దానిలో నాలుగు స్పూన్ల ఆయిల్ వేసి దాంట్లో కొంచెం జీలకర్ర, ఒక బిర్యానీ ఆకు, రెండు యాలకులు, రెండు లవంగాలు, ఒక దాల్చిన చెక్క ,వేసి వేయించుకోవాలి. తర్వాత ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలను వేసి ఎర్రగా వేయించుకున్న తర్వాత. దానిలో కొంచెం పసుపు, రెండు స్పూన్ల కారం, ఒక స్పూను ఉప్పు, ఒక స్పూన్ జీలకర్ర పొడి, ఒక స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి.
తర్వాత దానిలో చికెన్ వేసి ఒక 15 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి. ఇక తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న జీడిపప్పు టమాటా పేస్ట్ ని దాంట్లో వేసి మూత పెట్టి మరో ఐదు నిమిషాలు పాటు ఉడికించుకోవాలి. తర్వాత నూనె పైకి తేలిన తర్వాత కొంచెం ఫ్రెష్ క్రీమ్, కొంచెం బటర్, వేసి రెండు నిమిషాల పాటు ఉంచి స్టవ్ కట్టేయాలి. తరువాత వేయించిన జీడిపప్పు కూడా వేసి సర్వ్ చేసుకోవడమే అంతే రెస్టారెంట్ స్టైల్ లో చికెన్ కర్రీ ఎంతో టేస్టీగా ఇంట్లోనే సింపుల్ గా ఈ స్టైల్ లో చేసుకోవచ్చు..