Green Chicken Curry : రొటీన్ చికెన్ కర్రీ తిని బోర్ కొట్టిందా… అయితే, ఈ గ్రీన్ చికెన్ కర్రీని ఇలా ట్రై చేయండి, అదిరిపోయే టేస్ట్…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Green Chicken Curry : రొటీన్ చికెన్ కర్రీ తిని బోర్ కొట్టిందా… అయితే, ఈ గ్రీన్ చికెన్ కర్రీని ఇలా ట్రై చేయండి, అదిరిపోయే టేస్ట్…?

 Authored By ramu | The Telugu News | Updated on :3 July 2025,12:20 pm

ప్రధానాంశాలు:

  •  Green Chicken Curry : రొటీన్ చికెన్ కర్రీ తిని బోర్ కొట్టిందా... అయితే, ఈ గ్రీన్ చికెన్ కర్రీని ఇలా ట్రై చేయండి, అదిరిపోయే టేస్ట్...?

Green Chicken Curry : ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా కొత్త వంటకాన్ని ట్రై చేసి చూడాలి అనుకుంటారు. అలాంటివారికి ఈ వంటకం ఎంతో రుచిని ఇస్తుంది. అందులో చికెన్ కర్రీ అంటే చాలామంది ఇష్టపడతారు. చికెన్ కర్రీని చాలామంది ఫ్రై లాగా, సూపు, ట్రై చేసి తిని బోర్ కొట్టిన వారికి, ఈ రకమైన చికెన్ ని ట్రై చేసి చూడండి. అదిరిపోయే టెస్ట్ తో పాటు మంచి ఫ్లేవర్ కూడా ఉంటుంది. ఈ చికెన్ ఏ గ్రీన్ చికెన్. గ్రీన్ చికెన్ ని ఒక్కసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. తరువాత దాని రుచి మీకే తెలుస్తుంది. టేస్టీ టేస్టీ గ్రీన్ చికెన్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం..

Green Chicken Curry రొటీన్ చికెన్ కర్రీ తిని బోర్ కొట్టిందా అయితే ఈ గ్రీన్ చికెన్ కర్రీని ఇలా ట్రై చేయండి అదిరిపోయే టేస్ట్

Green Chicken Curry : రొటీన్ చికెన్ కర్రీ తిని బోర్ కొట్టిందా… అయితే, ఈ గ్రీన్ చికెన్ కర్రీని ఇలా ట్రై చేయండి, అదిరిపోయే టేస్ట్…?

Green Chicken Curry చికెన్ కర్రీ తయారీకి కావలసిన పదార్థాలు

చికెన్,కొత్తిమీర గుప్పెడు,వెల్లుల్లి, పచ్చిమిర్చి, పుదీనా, ఉల్లిపాయ, జీడిపప్పు, మిరియాల పొడి, పసుపు,పెరుగు,గరంమసాలా, నూనె.

Green Chicken Curry గ్రీన్ చికెన్ తయారీ విధానం :

మీరు షాపు నుంచి తెచ్చుకున్న చికెన్ ని, మంచి నీటితో శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. కొత్తిమీర,తొక్క తీసిన వెల్లుల్లి రెబ్బలు,పచ్చిమిర్చి, పుదీనా,ప్రై చేసిన ఉల్లి ముక్కలు, జీడిపప్పు, వేసి పేస్టులా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తరువాత,ఒక బౌల్లో కడిగిన చికెన్ కు,ఉప్పు,నల్ల మిరియాల పొడి, పసుపు,పెరుగు, గ్రైండ్ చేసిన గ్రీన్ పేస్ట్ వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక పాన్ లో నూనె తీసుకొని స్టవ్ పై వేడి అయిన తర్వాత రెడీగా ఉంచుకున్న చికెన్ మొత్తం వేసి బాగా కలపాలి. పాన్ పై మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో మధ్య మధ్యలో కలుపుతూ 15 నిమిషాల పాటు స్టవ్ పై ఉడికించాలి. 15 నిమిషాల తర్వాత అందులో గరం మసాలా వేసి ముక్క ఉడికిందో లేదో ఒకసారి చూసుకోవాలి. తగినంత ఉప్పు ను వేసి కలుపుకోవాలి.
కాసేపు సిమ్ములో ఉడికించాలి. అంతే, టేస్టీ టేస్టీ గ్రీన్ చికెన్ కర్రీ రెడీ అవుతుంది.ఈ కర్రీ రైస్, చపాతీ, పరోటాలలో చాలా రుచిగా ఉంటుంది.ఇది మీ ప్రియమైన వారికి,పిల్లలకి కుటుంబ సభ్యులకి కచ్చితంగా నచ్చుతుంది.ఒకసారి ట్రై చేసి చూడండి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది