Chicken Curry Recipe : ఒక కేజీ చికెన్ తో ఫుల్ గ్రేవీ వచ్చేలా జన్మలో మర్చిపోలేని చికెన్ కర్రీ… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Chicken Curry Recipe  : ఒక కేజీ చికెన్ తో ఫుల్ గ్రేవీ వచ్చేలా జన్మలో మర్చిపోలేని చికెన్ కర్రీ…

Chicken Curry Recipe  : ఈరోజు కేజీ చికెన్ తో సూపర్ టేస్టీగా చిక్కటి గ్రేవీతో కర్రీ ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను. సింపుల్ ఇంగ్రిడియంట్స్ తో అయిపోవాలి. కానీ డెలిషియస్ గా ఉండాలి. అలా చేయాలి అంటే చికెన్ కర్రీని ఇలా ఒకసారి ట్రై చేయండి. ఎన్ని చికెన్ కర్రీ చేసినా కొన్ని వెరైటీస్ మన ఫేవరెట్ అయిపోతుంది. అలా చికెన్తో చేసుకునే కర్రీ రైస్, చపాతీ, పుల్కా, రోటి బిర్యాని ఇలా ఎందులో అయినా కూడా […]

 Authored By ramu | The Telugu News | Updated on :26 April 2024,1:00 pm

ప్రధానాంశాలు:

  •  Chicken Curry Recipe  : ఒక కేజీ చికెన్ తో ఫుల్ గ్రేవీ వచ్చేలా జన్మలో మర్చిపోలేని చికెన్ కర్రీ...

  •  Chicken Curry Recipe  : ఈరోజు కేజీ చికెన్ తో సూపర్ టేస్టీగా చిక్కటి గ్రేవీతో కర్రీ ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను. సింపుల్ ఇంగ్రిడియంట్స్ తో అయిపోవాలి.

  •  కేజీ చికెన్ కి సరిపోయే విధంగా ఇంగ్రిడియంట్స్ అన్ని కూడా చెప్తున్నాను అసలు మిస్ కాకుండా అన్నిటిని కూడా ఫాలో అవుతూ ఇంట్లో రెసిపీని ట్రై చేసేయండి.

Chicken Curry Recipe  : ఈరోజు కేజీ చికెన్ తో సూపర్ టేస్టీగా చిక్కటి గ్రేవీతో కర్రీ ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను. సింపుల్ ఇంగ్రిడియంట్స్ తో అయిపోవాలి. కానీ డెలిషియస్ గా ఉండాలి. అలా చేయాలి అంటే చికెన్ కర్రీని ఇలా ఒకసారి ట్రై చేయండి. ఎన్ని చికెన్ కర్రీ చేసినా కొన్ని వెరైటీస్ మన ఫేవరెట్ అయిపోతుంది. అలా చికెన్తో చేసుకునే కర్రీ రైస్, చపాతీ, పుల్కా, రోటి బిర్యాని ఇలా ఎందులో అయినా కూడా బెస్ట్ కాంబినేషన్ చికెన్ ముక్క అనేది సాఫ్ట్ గా ఉండి అండ్ కర్రీలో మంచిగా గ్రేవీ వస్తుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. డేఫినెట్గా మీరు కూడా ఈ చికెన్ కర్రీని ఇంట్లో ట్రై చేయండి. కేజీ చికెన్ కి సరిపోయే విధంగా ఇంగ్రిడియంట్స్ అన్ని కూడా చెప్తున్నాను అసలు మిస్ కాకుండా అన్నిటిని కూడా ఫాలో అవుతూ ఇంట్లో రెసిపీని ట్రై చేసేయండి.

Chicken Curry Recipe చికెన్ కర్రీ కి కావాల్సిన పదార్థాలు

చికెన్, పసుపు, ఉప్పు, గరం మసాలా, పెరుగు, కారం, కొత్తిమీర, ఉల్లిపాయలు, టమాటాలు, కరివేపాకు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, ఆయిల్ మొదలైనవి…

తయారీ విధానం; ముందుగా ఒక కేజీ చికెన్ తీసుకుని రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకున్న తర్వాత చివరిసారిగా కొద్దిగా ఉప్పు నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేసి ఆ తర్వాత నీళ్లతో కడిగిస్తే నీచు వాసన అనేది లేకుండా ఉంటుంది. ఇలా క్లీన్ చేసుకున్న కేజీ చికెన్ లోకి ఇప్పుడు అర టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకోండి. వేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ఉప్పు కూడా వేసుకోవాలి.

ఇందులోని ఒక టేబుల్ స్పూన్ దాకా నూనె అలాగే రెండు టేబుల్ స్పూన్ల దాకా పెరుగు వేయండి. ఇక తర్వాత రబ్ చేస్తూ చికెన్ ని బాగా మ్యారినేట్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ చికెన్ ని ఫ్రిజ్లో ఒక వన్ అవర్ పాటు ఉంచండి. ఫ్రీజర్ లో పెడితే ఇంకా మంచిది ఫ్రీజర్ లో మీరు ఈ చికెన్ ని గనక మ్యారినేట్ చేసుకుంటే చికెన్ అనేది బాగా టెండర్ గా ఉంటుందన్నమాట. ఎక్కువ సేపు ఉడికించాల్సిన పని లేకుండా చాలా సాఫ్ట్ గా ముక్క ఉడికిపోతుంది. సో చికెన్ ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకోండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా పుచ్చు గింజలు తీసుకోండి. ఈ గింజలతో పాటుగా ఒక టేబుల్ స్పూన్ దాకా జీడిపప్పు పలుకులు కూడా వేసుకోవాలి. అండ్ 1 టీ స్పూన్ దాకా గసగసాలు కూడా వేయండి. ఇవన్నీ వేసిన తర్వాత ఇవి మునిగేటట్టుగా నీళ్లు పోసి కనీసం అరగంట లేదా గంట పాటు నానబెట్టుకోవాలి.

చికెన్ ఎలాగో మనం గంట మ్యారినేట్ చేస్తాం. కాబట్టి ఇవి కూడా గంటలో నానిపోతాయి. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకోండి కడాయిలోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత వేసుకోండి. అలాగే 10 నుండి 15 దాకా వెల్లుల్లిపాయల్ని పైన పొట్టు తీసేసి వేసుకోవాలి. వీటితో పాటుగా ఒక మీడియం సైజ్ టమాట అలాగే చిన్న ఉల్లిపాయని కొంచెం పెద్ద ముక్కలుగాని కట్ చేసుకుని వేసుకోండి. వీటన్నిటినీ కూడా నూనెలో కొద్దిసేపు మగ్గించుకోవాలి. వీటిని మనం గ్రేవీ కోసం ప్రిపేర్ చేస్తున్నాము. మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ ఉల్లిపాయలు, టమాట ముక్కలు సాఫ్ట్ గా మగ్గేంత వరకు మగ్గించుకోండి. ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా కూడా వేసి వీటిని కూడా నూనెలో కొద్దిసేపు వేయించండి. ఇలా వేయించుకున్న వీటన్నిటిని కూడా స్టవ్ ఆపేసేసి పక్కకు దించుకుని పూర్తిగా చల్లరానివ్వండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి మన నానబెట్టుకున్న జీడిపప్పు గసగసాలు సీడ్స్ ని వేసేసేయండి.

Chicken Curry Recipe ఒక కేజీ చికెన్ తో ఫుల్ గ్రేవీ వచ్చేలా జన్మలో మర్చిపోలేని చికెన్ కర్రీ

Chicken Curry Recipe  : ఒక కేజీ చికెన్ తో ఫుల్ గ్రేవీ వచ్చేలా జన్మలో మర్చిపోలేని చికెన్ కర్రీ…

అలాగే మనం వేయించుకున్న ఉల్లిపాయ, టమాటాలు కూడా ఇందులో వేసేసి మెత్తగా పేస్టులా గ్రైండ్ చేసుకోండి. అవసరమైతే కొద్దిగా నీళ్లు కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవచ్చు. అందులోకి నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర అలాగే ఒక ఇంచు దాక దాల్చిన చెక్కలు ,నాలుగు ఐదు లవంగాలు, ఒక బిర్యానీ ఆకు ఒక చిన్న ఎండు మిరపకాయ కూడా వేసేసి ఈ దినుసుల్ని కొద్దిగా వేయించాలి. తర్వాత రెండు మూడు పచ్చిమిర్చిని ఇలా చీల్చుకుని కూడా వేసుకుని ఫ్రై చేయండి. ఇవి కొంచెం వేగిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ని ఈ ఆయిల్ లో వేసేసేయండి. నీళ్లనేవి అసలు వేయకుండా ఈ చికెన్ లో వచ్చే వాటర్ తోనే చికెన్ పూర్తిగా ఉడికించుకోవాలి. మూత పెట్టుకుంటూ మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఉడికించండి .ముక్క పట్టుకుంటే మెత్తగా అయిపోవాలి అనమాట. అంతవరకు ఈ చికెన్ ఉడకబెట్టేసుకోండి. అండ్ గ్రేవీ కూడా మీకు దగ్గరకు అయిపోవాలి. ఆయిల్ అనేది పైకి తేలాలి. సో అలా ఉడికించుకున్న ఈ చికెన్ లోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ని గ్రేవీ పేస్ట్ మొత్తాన్ని కూడా వేసేసేయాలి. ఇప్పుడు ఈ గ్రేవీ పేస్ట్ ని నూనెలో బాగా ఫ్రై చేయాలి.

ఈ పేస్ట్ ఎంత బాగా వేగితే చికెన్ కర్రీ అంత టేస్టీగా ఉంటుందన్నమాట.. మీరు కలుపుతూ మూత పెట్టుకుంటూ మంటని మీడియం టు లో ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ బాగా ఉడికించండి. ఆ తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ దాకా చికెన్ మసాలా పౌడర్ ని వేసుకోండి. తర్వాత బాగా కలుపుకోండి. కలుపుకొని జస్ట్ టూ మినిట్స్ పాటు లో ఫ్లేమ్ లో మగ్గించండి. మసాల ఫ్లేవర్స్ అన్ని కూడా చికెన్ కి బాగా పడతాయి. ఆ తర్వాత ఇందులోకి మీకు ఎంత గ్రేవీ అయితే అవసరమో దానికి తగ్గట్టుగా నీళ్లు వేసుకోండి. కనీసం అరకప్పు పైన నీళ్లు పడతాయి. తిక్కుగా కొంచెం ఎక్కువ గ్రేవీ కావాలి. అనుకుంటే నీళ్లు పోసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ ని అడ్జస్ట్ చేసుకోండి. మరొక రెండు మూడు నిమిషాల పాటు లోటు మీడియం ఫ్లేమ్ లో ఉడికించి ఆ తర్వాత దించేసుకోవచ్చు.. ఇక తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసేసి దించేసేయండి. మీ ఇంట్లో చేసే ఈ కర్రీ పక్కింటికి కూడా స్మెల్ వచ్చే విధంగా సూపర్ ఫ్లేవర్ ఫుల్ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడ టెక్స్ట్ చూస్తేనే మీకు అర్థమవుతుంది చికెన్ కర్రీ ఎంత టేస్టీగా ఉంటుంది..

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది