Butter Chicken Recipe : బట్టర్ చికెన్ రెసిపీ ఇలా చేసుకుంటే మధురమే
Butter Chicken Recipe : చికెన్.. అదో ఎమోషన్. నాన్ వెజ్ ఐటెమ్స్ ఎన్ని ఉన్నా.. చికెన్ అంటేనే చాలా మందికి ఇష్టం ఉంటుంది. సండే వచ్చిందంటే చాలు ప్రతి ఇంట్లో చికెన్ కర్రీ ఘుమ ఘమలు రావాల్సిందే. చాలా మంది ఇళ్లలో చికెన్ ఫ్రై, లేదా చికెన్ పులుసు ఎక్కువగా వండుతారు. కానీ ఇలా ఎప్పుడైనా ట్రై చేసి చూడండి. బట్టర్ తో చేసే ఈ చికెన్ తింటే వాహ్వా అనాల్సిందే.. కావాల్సిన పదార్థాలు చికెన్ ఉల్లి పాయలు వెల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా కారం ఉప్పు పసుపు దాల్చిన చెక్క యాలకులు లవంగాలు బిర్యానీ ఆకు కసూరి మెంతి పెరుగు మిల్క్ క్రీం బట్టర్ ముందుకు చికెన్ ముక్కలను చక్కగా శుభ్రం చేసుకోవాలి.
చికెన్ ను ఓ గిన్నెలోకి తీసుకుని పసుపు, కారం, గరం మసాలా, కొద్దిగా ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, నిమ్మరసం, పెరుగు వేసుకుని మంచిగా కలుపుకోవాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని చక్కగామారినేట్ అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి. తర్వాత మరో గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టుకోవాలి. కొద్దిగా నూనె వేసి గరం చేసుకోవాలి. ముందుగా కారం కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కలను నూనెలో వేసుకోవాలి. మంచి కలర్ వచ్చే వరకు చికెన్ ముక్కలను డీ ఫ్రై చేసుకోవాలి.ఇదే గిన్నెలో నూనె తీసేసి అందులో కొద్దిగా బట్టర్ వేసుకుని వేడు చేసుకోవాలి. తర్వాత దాల్చిన చెక్క, యాలకులు, బిర్యానీ ఆకు వేసి వేయించుకోవాలి. తర్వాత పెద్దగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి.
కొద్దిగా కలర్ వచ్చాక వెల్లుల్లి రెబ్బలు వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత పెద్ద సైజులో కట్ చేసిన టమాటా ముక్కలు వేసి వేయించుకోవాలి. తర్వా వాటిని మిక్సీలోకి తీసుకుని మెత్తని పేస్టు గా చేసుకోవాలి.తర్వాత అదే గిన్నెలో బట్టర్ వేసుకుని వేడి చేసుకోవాలి. తర్వాత కొద్దిగా కారం, అలాగే ముందుకు రెడీ చేసి పెట్టుకున్న పేస్టు వేసుకుని మంచిగా కలుపుకోవాలి. తర్వాత కొన్ని నీళ్లు పోసి దగ్గరికి వచ్చేంత వరకు వేడి చేసుకున్నాక ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కలు వేయాలి. తర్వాత ఒకటి లేదా రెండు మధ్యలోకి కట్ చేసిన పచ్చి మిర్చి, కరివేపాకు వేసుకుని కలుపుకోవాలి. ఓ రెండు నిమిషాల తర్వాత కసూరి మెంతి వేసుకోవాలి. తర్వాత చక్కగా ఉడికించుకోవాలి. దించడానికి కొద్దిగా ముందుగా మిల్క్ క్రీం వేసుకుని కలుపుకుని దించేసుకోవాలి.