Guthhi Kakarakaya Ulli Karam : నోరూరించే గుత్తి కాకరకాయ ఉల్లికారం ఎలా చేసుకోవాలో మీకు తెలుసా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Guthhi Kakarakaya Ulli Karam : నోరూరించే గుత్తి కాకరకాయ ఉల్లికారం ఎలా చేసుకోవాలో మీకు తెలుసా..?

 Authored By pavan | The Telugu News | Updated on :24 May 2022,12:30 pm

Guthhi Kakarakaya Ulli Karam : గుత్తి వంకాయ కూర గురించి తెలియని వాళ్లు తనని వాళ్లు ఉండరంటే అతిశయోక్తి కాదు. మసాలాలు నూరి గుత్తి బెండకాయ, దొండకాయ, చివరకు కాకరకాయ చేసిన ఆవురావురుమంటూ తినేయాల్సిందే. అంతగా రుచింగా ఉంటుంది మరి గుత్తి కాకరకాయ కూర. అయితే ఆరోగ్యానికి ఎంతో మంచి చేసే.. అలాగే రుచిని అందించే గుత్తి కాకర కాయ ఉల్లికారం ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు.. అర కేజీ చిన్న చిన్న కాకరకాయలు, 100 గ్రాముల చింతపండు, 2 ఉల్లిపాయలు, మూడు టేబుల్ స్పూన్ల కారం, తగినంత ఉప్పు, ఆరు వెల్లుల్లి రెబ్బలు. కేవలం ఈ పదార్థాలు ఉంటే చాలు నోరూరించే గుత్తి కాకరకాయ ఉల్లికారం తయారు చేసుకోవచ్చు. అయితే ముందుగా ఒక పాన్ తీసుకొని అందులో నీళ్లు, చింతపండు వేసుకోవాలి. వీటిలోని శుభ్రంగా కడిగిన కాకరకాయలకు మధ్య గాట్లు పెట్టుకొని అందులో వేసి ఉడికించుకోవాలి. నీరంతా ఆవిరైపోయాక వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, కారం వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద పెనం పెట్టుకొని కాస్త నూనె పోయాలి. ఇందులో ముందుగా ఉడికించుకున్న కాకరకాయలు వేసి కాసేపు ఫ్రై చేయాలి.

how to make guthhi kakarakaya ullikaram in home

how to make guthhi kakarakaya ullikaram in home

ఆ తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్ లో ఇంకెంచెం నూనె వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమం వేసి వేయించుకోవాలి. కాసేపు కాగానే కాకరకాయలు కూడా వేసి పది నిమిషాలు సన్నని మంట మీద ఉడికించుకోవాలి. ఆ తర్వాత వీటిని సర్వింగ్ బౌల్ లోకి తీస్కుంటే సరిపోతుంది.ఇంత సులువుగా తయారు చేసుకోవచ్చే గుత్తి కాకరకాయ ఉల్లి కారం చాలా రుచిగా ఉంటుంది. కేవలం ఐదే ఐదు పదార్థాలతో ఆరోగ్యాన్ని అందించే ఆ వంటకాన్ని మీరూ ఓ సారి ట్రై చేయండి. కేవలం 15 నిమిషాల్లోనే ఈ వంటకాన్ని తయారు చేసి మీకు నచ్చిన వారికి తినిపించారంటే… మిమ్మల్ని వారు పొగడ్తలతో ముంచెత్తుతారు కచ్చితంగా. వంట రాని వాళ్లు కూడా సులువుగా తయారు చేయొచ్చు. అందుకే మీకు ఎక్కువ టైం లేనప్పుడు ఈ అద్భుతమైన వంటకాన్ని తయారు చేసి అందరి మనసుల్ని గెలుచుకోండి.

పూర్తి వీడియోను వీక్షించండి.

Also read

pavan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది