Mutton Mandi : మందీ బిర్యాని ఎంతో ఈజీగా… ఇంట్లోనే చేసుకోండి ఇలా… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Mutton Mandi : మందీ బిర్యాని ఎంతో ఈజీగా… ఇంట్లోనే చేసుకోండి ఇలా…

 Authored By aruna | The Telugu News | Updated on :26 July 2022,8:30 pm

Mutton Mandi : బిరియానీలలో ఎన్నో రకాల బిర్యానీలు ఉంటాయి. బిర్యానీ అంటే రెస్టారెంట్ లోనే ఎక్కువగా చేస్తుంటారు. కానీ ఇప్పుడు అందరూ ఇంట్లో కూడా ట్రై చేస్తున్నారు. ఇటీవల ఎక్కువగా వినిపించే పేరు మందీ బిర్యాని.. ఈ మధ్యకాలంలో ఎక్కువగా దీనిని తినడానికి ఇష్టపడుతున్నారు. అయితే ఈ బిర్యానీని కూడా మనం ఇంట్లోనే ఈజీగా, తయారు చేసుకోవడం ఎలాగో తెలుసుకుందామా.. అయితే దీనికి ఏమేమి కావాలో, అలాగే తయారీ విధానం ఎలాగో చూద్దాం పదండి.. ఈ మందీ బిర్యానికి కావాల్సిన పదార్థాలు: 1) మటన్ పెద్ద మొక్కలు 2) జీలకర్ర 3)యాలకులు 4)లవంగాలు5) సొంటి6) ఒక బిర్యానీ ఆకు7) ధనియాలు 8)మిరియాలు 9)నిమ్మకాయ 10)జీడిపప్పు,11) బాదంపప్పు, 12)దాల్చిన చెక్క13) జాపత్రి ఆకు14) కిస్ మిస్ లు15) ఉల్లిపాయలు16) అల్లం వెల్లుల్లి పేస్ట్ 17)నూనె 18)నెయ్యి19) బాస్మతి రైస్ 20) పసుపు 21) ఉప్పు మొదలైనవి.

తయారీ విధానం: ముందుగా ఒక ఆఫ్ కిలో రైస్ ను తీసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. తర్వాత ముందుగా బాండీ పెట్టుకొని దానిలో రెండు స్పూన్ల ఆయిల్ రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని, దానిలో జీడిపప్పు బాదం కిస్మిస్లు వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి.తర్వాత అదే ఆయిల్లో ఆఫ్ కేజీ మటన్ ముక్కలు వెయ్యాలి. వాటిని కొద్దిసేపు ఫ్రై అవ్వనివ్వాలి. ఇంతలో ఒక మిక్సీ జార్ లో నాలుగు లవంగాలు, నాలుగు యాలకులు, కొన్ని మిరియాలు, ఒక సొంటి ముక్క, రెండు స్పూన్ల ధనియాలు, నాలుగైదు దాల్చిన చెక్క ముక్కలు, వేసి పౌడర్ చేసుకోవాలి. ముందుగా ఫ్రై అవుతున్న మటన్ ముక్కలలో ఈ పౌడర్ ని కొంచెం వేసుకుని, బాగా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత దానిలో అర లీటరు నీళ్లను వేసుకొని, కొంచెం పసుపు వేసి, కొంచెం ఉప్పు వేసి బాగా ఉడకనివ్వాలి. దానిని దింపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బండి తీసుకుని దానిలో కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేసి దాన్లో సన్నని ఉల్లిపాయ ముక్కలను వేసి, దాంట్లో రెండు యాలకులు, రెండు లవంగాలు, ఒక దాల్చిన చెక్క వేసి, ఎర్రగా వేయించుకోవాలి.

How to make Mandi Biryani at home very easily

How to make Mandi Biryani at home very easily

తర్వాత దానిలో ముందుగా ఉడకబెట్టుకున్న మటన్ ని వాటర్ లోంచి తీసి ఈ బౌల్లో వేసి ఎర్రగా వేయించుకోవాలి. తర్వాత కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. ఎర్రగా వచ్చేవరకు, తర్వాత దీనిని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మటన్ ఉడకబెట్టిన నీరు ఆ నీటితోనే మనం రైస్ ను వండుకోవాలి. ఆ వాటర్ లో ముందుగా నానబెట్టుకున్న రైస్ ను వేసి అలాగే ఉప్పు కూడా వేసి70% ఉడకనివ్వాలి. తర్వాత మూత తీసి ఫ్రై చేసిన మటన్ ముక్కలను తీసి ఆ రైస్ పైన పెట్టుకోవాలి. ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత రైస్ మధ్యలో ఒక చిన్న గిన్నెను ఉంచి, బొగ్గుని తీసుకొని ఆ గిన్నెలో పెట్టాలి. దానిపైన కొంచెం నెయ్యిని అలాగే లవంగాల పొడిని వేసి అలాగే ఆ రైస్ పైన జీడిపప్పులు, కిస్ మిస్ లను, బాదంపప్పులు చల్లుకొని, ఆ గిన్నెపైన అల్యూమినియం పేపర్ పెట్టి, దానిపైన మూతన పెట్టి ,ఒక పది నిమిషాలు ఉంచాలి. తరువాత స్టవ్ ఆపి ఒక పది నిమిషాల వరకు అలాగే ఉంచాలి. తర్వాత దానిని తీసి సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవాలి. అంతే ఎంతో ఈజీగా ఇంట్లోనే మందీ బిర్యాని రెడీ..

YouTube video

Also read

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది