Paneer Ghee Roast Recipe : పన్నీర్ ఘీ రోస్ట్.. చపాతీలతో తింటే ఉంటది.. ఆహా అనాల్సిందే!
Paneer Ghee Roast Recipe : మీకు చపాతీలు అంటే చాలా ఇష్టమా. తరచుగా చపాతీలు తినిలి అనిపిస్తుంటుందా. కానీ తరచుగా చపాతీతో పాటు కూరలు తినాలనిపించట్లేదా. అయితే ఇంకే చపాతీల్లోకి చాలా బాగుండే పన్నీర్ ఘీ రోస్ట్ ని… ఒక్కసారి ట్రై చేయండి. పనీర్ నెయ్యి రుచిగా ఎలా చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. కావాల్సిన పదార్థాలు.. 200 గ్రాముల వెన్న, 3 టేబుల్ స్పూన్ల నెయ్యి, టేబుల్ స్పూన్ చొప్పున పెరుగు, దేశీ చక్కెర, చింత పండు, ఉప్పు రుచికి సరిపడా, టేబుల్ స్పూన్ చొప్పున కొత్తిమీర గింజలు, జీలకర్ర, సోంపు, అర టీ స్పూన్ మిరయాలు, పావు టీ స్పూన్ మెంతులు, 2 లవంగాలు, 2 పచ్చి మిర్చి, 6 కాశ్మీరి మిరపకాయలు, నీరు.
తయారీ విధానం… ముందుగా పనీర్ ను ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత చింత పండును వేడి నీళ్లలో నానబెట్టాలి. తర్వాత ఓవెన్ లో ప్రైయింగ్ పాన్ పెట్టి పోపు దినుసులన్నీ వేసి వేయించి పెట్టుకోవాలి. తర్వాత పచ్చి మిర్చి వేసి వేయించాలి. అవి చల్లారాక మిక్సీ జార్ లో వేసి చింత పండు రసం వేుకొని మెత్తగా రుబ్బుకోవాలి.
తర్వాత ఓనెలో ప్రైయింగ్ పాన్ పెట్టి అందులో నెయ్యి పోసి వేడి అయ్యాక పన్నీర్ ముక్కులు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించి ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత నెయ్యి.. ముందుగా రుబ్బుకున్న మిశ్రమాన్ని వేసి వేయించాలి. తర్వాత పెరుగు వేసి రెండు నిమిషాలు బాగా తిప్పి రుచికి సరిపడా ఉప్పు, పంచదారా వేసి కాసేపు ఉడికించుకోవాలి. తర్వాత వేయించి పెట్టుకున్న పనీర్ ముక్కలను వేసి 2 నిమిషాలు మరిగిస్తే రుచికరమైన పనీర్ నెయ్యి రోస్ట్ రెడీ.