Neem Oil : ఏడాది పాటు స్టాక్ ఉండే వేప నూనె… ఇంట్లోనే ఎంతో ఈజీగా తయారు చేసుకోండి ఇలా…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Neem Oil : ఏడాది పాటు స్టాక్ ఉండే వేప నూనె… ఇంట్లోనే ఎంతో ఈజీగా తయారు చేసుకోండి ఇలా…!

 Authored By prabhas | The Telugu News | Updated on :21 October 2022,5:00 pm

Neem Oil : వేప చెట్టు అంటే తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు.. ఈ వేప చెట్టుని హిందూ సాంప్రదాయాలలో దైవంగా కూడా పూజిస్తూ ఉంటారు. ఈ చెట్లని ఎక్కువగా పల్లెటూర్లలో చూస్తూ ఉంటాం. ఆ చెట్టుని పల్లెటూరి ప్రజలు ఎన్నో విధాలుగా వాడుకుంటూ ఉంటారు. దాని నుంచి వచ్చే వేప కాయలను ఎండబెట్టి నూనెను తీస్తూ ఉంటారు. ఈ వేప నూనె ఆయుర్వేదంలో ఎక్కువగా వాడుతూ ఉంటారు. అలాగే ఈ నూనె చాలా రకాలుగా సహాయపడుతుంది. వయసు తరహా లేకుండా దీనిని వినియోగించుకోవచ్చు. దీనిని వాడడం వలన చాలా సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. వేప చెట్టులో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉంటుంది. కాబట్టి చర్మ సంబంధిత వ్యాధులకు బాగా ఉపయోగపడుతుంది. మార్కెట్లో కొనుక్కునే వేప నూనె కంటే మన ఇంట్లో తయారు చేసుకునే వేప నూనె వలన చాలా ఉపయోగాలు ఉంటాయి.

అలాగే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దాన్లో కెమికల్స్ కూడా ఉండవు. దీని తయారీ విధానం ఇప్పుడు మనం చూద్దాం.. ఈ నూనెకు మనకు ముందుగా కావలసినవి. వేపకాయలు ఇవి అన్ని సీజన్లో దొరకు. కావున ఇవి ఎప్పుడు దొరికితే అప్పుడే ఈ నూనెను తయారు చేసుకోవాలి. ఈ వేపకాయలు సీజన్లో చెట్ల కింద విరివిగా దొరుకుతుంటాయి. మనకి దొరికిన వేపకాయలని తీసుకొని ఒక రోలు సహాయంతో కాయలని విత్తనాలతో సహా బాగా మెత్తగా దంచుకోవాలి. తర్వాత ఈ దంచుకున్న వేపకాయలని పక్కన ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ పై ఒక కడాయి పెట్టి దానిలో 200 గ్రాముల ఆముదం నూనెను కూడా దాన్లో వేసుకొని బాగా మరగబెట్టుకోవాలి. అలాగే దంచి పక్కన పెట్టుకున్న వేపకాయలను దీంట్లో వేసి బాగా మరగబెట్టుకోవాలి. దాన్లో వేపాకులను ఒక పిడికెడు వరకు వేసి మరల కొద్దిసేపు మరగబెట్టి బాగా మరిగిన ఈ నూనెను చల్లారబెట్టుకొని తర్వాత వడకట్టుకోవాలి.

how to prepare neem oil at home

how to prepare neem oil at home

దీన్లో ఆముదమును వాడడం వలన మనకు ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. పాతకాలం రోజులలో ఏ నూనె అయినా ఇంట్లో తయారు చేసుకునే వాళ్ళు. అలా చేసుకోవడం వలన వాళ్లకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్, సమస్యలు ,ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్లే కాదు.. అలాగే వారి జుట్టు ఎప్పుడూ చుండ్రు లేకుండా ఒత్తుగా మెరిసిపోతూ ఉండేది. కావున మనం కూడా అలాగే ఇంట్లో తయారు చేసుకోవడానికి ప్రయత్నిద్దాం.. ఈ వేప నూనెను సాయంకాలం సమయంలో జుట్టుకి బాగా పట్టించి మరుసటి రోజు ఉదయం గాడత తక్కువ గల షాంపూ ని వాడి తల స్నానం చేయాలి. ఈ మాదిరిగా నిత్యము చేసుకోవచ్చు. లేదంటే వారానికి మూడుసార్లు అయినా చేసుకోవచ్చు. అలాగే చర్మ సమస్యలు ఎదుర్కొనే వాళ్ళు ఈ నూనె బాగా ఉపయోగపడుతుంది. చర్మంపై వచ్చే దద్దుర్లు, గజ్జి ,తామర వాటిపైన ఈ నూనెను రాసుకోవడం వలన మంచి ఉపశమనం పొందవచ్చు. అదేవిధంగా ఈ వేపకాయలను ఎండబెట్టి పొడి చేసి చెట్లకి ఎరువుగా వేయడం వలన ఈ ఎటువంటి పురుగులైన నశిస్తాయి. మొక్కలు చక్కగా ఎదుగుతాయి…

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది