EPFO : పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవ‌డానికి ఇంట‌ర్‌నెట్‌తో సంబంధం లేదు… చెక్ చేసుకోవ‌డం ఎలానో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

EPFO : పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవ‌డానికి ఇంట‌ర్‌నెట్‌తో సంబంధం లేదు… చెక్ చేసుకోవ‌డం ఎలానో తెలుసా?

 Authored By sandeep | The Telugu News | Updated on :4 February 2022,6:00 pm

EPFO : ఈ రోజుల్లో ప్ర‌తి ఒక్క‌రు చిన్నా చిత‌కా జాబులు చేస్తూనే ఉన్నారు. ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికి ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్​) గురించి తెలిసే ఉంటుంది. ప్రతి నెల ఉద్యోగి జీతంలో (బేసిస్​ శాలరీపై) 12 శాతం ఇందులో జమ అవుతుంది. అంతే మొత్తంలో వారి ఉద్యోగ సంస్థ కూడా అందులో జమ చేస్తుంది.మరి ఉద్యోగాలు తమ ఖాతాల్లో ఎంత బ్యాలెన్స్ ఎంత ఉందే తెలుసుకోవడం ఎలా? నెట్ లేక‌పోయిన కూడా పీఎఫ్ చెక్ చేసుకునే ప‌ద్ద‌తులు ఏంట‌నే వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. ఈపీఎఎఫ్ఓ (EPFO) వెబ్‌సైట్‌ ద్వారా.. ఈపీఎఫ్ఓ వెబ్‌సైట్‌లో యూఏఎన్ (UAN) నంబర్‌, పాస్ వర్డ్ ద్వారా లాగిన్ అయి.. పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. ముందుగా ఈపీఎఫ్ఓ పోర్టల్ http://www.epfindia.gov.in లోకి వెళ్లి పైన అవర్ సర్వీసెస్ ఆప్షన్లలో రెండోది ఎంప్లాయిస్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి. ఆ తర్వాతి పేజీలో కింది భాగంలో సర్వీసెస్‌లో మెంబర్ పాస్‌బుక్ అని ఉంటుంది. దానిపై క్లిక్ చేసి యూఏఎన్ నంబర్‌, పాస్ వర్డ్ ఎంటర్ చేస్తే బ్యాలెన్స్ వివరాలతో కూడిన పాస్ బుక్ వస్తుంది.

How you can check your epfo balance without internet

How you can check your epfo balance without internet

2. మిస్డ్ కాల్ ద్వారా.. పీఎఫ్ ఖాతాలో బ్యాలెన్స్ ఎంత ఉందని తెలుసుకునేందుకు సులువైన మార్గం ఇదే. మీ పీఎఫ్ ఖాతాతో లింక్ అయిన ఫోన్‌ నంబర్‌ నుంచి 011-22901406 నంబర్‌కు జస్ట్ మిస్డ్ కాల్ ఇస్తే సరి. ఫోన్‌కు ఎస్ఎంఎస్ ద్వారా పీఎఫ్ ఖాతాలో ఎంత ఉందనే మెసేజ్ వస్తుంది.

3. ఎస్ఎంఎస్ ద్వారా.. యూఏఎన్ నంబర్‌ ఉంటే.. ఇంటర్నెట్ లేకుండా, వెబ్‌సైట్‌లోకి వెళ్లకుండా కూడా మీ అకౌంట్ లో ఎంత మొత్తం ఉందో తెలుసుకునే విధానం ఇది. మీ పీఎఫ్ ఖాతాలో రిజిస్టర్ అయిన మొబైల్‌ నంబర్‌ ద్వారా 7738299899 అనే నంబర్‌కు మెసేజ్ చేస్తే బ్యాలెన్స్ వివరాలు వస్తాయి. EPFOHO అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి UAN నంబర్‌ టైప్ చేసి 7738299899 నంబర్‌కు ఎస్ఎంఎస్ చేయాలి. అంతే ఖాతాలో ఎంత బ్యాలెన్స్ ఉందనే వివరాలు ఎస్ఎంఎస్ ద్వారా వస్తాయి.

4. ఉమాంగ్ యాప్ యాప్‌ ద్వారా.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉమాంగ్ యాప్‌ ద్వారా కూడా పీఎఫ్ ఖాతా వివరాలు ఉద్యోగులు చెక్ చేసుకోవచ్చు. యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకొని.. లాగిన అయ్యాక అందులో చాలా ప్రభుత్వ సర్వీసులు కనిపిస్తాయి. అక్కడ ఈపీఎఫ్ఓ ఆప్షన్ ఎంచుకోవాలి. ఆ తర్వాత యూఏఎన్ నంబర్‌ నమోదు చేస్తే.. ఫోన్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేసి పీఎఫ్ ఖాతా వివరాలు చూడవచ్చు.

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది