7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్.. హెచ్ఆర్ఏ రూల్స్ మార్పు… ఇంటి రెంట్ అలవెన్స్ ఉండదా?
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక బ్యాడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే.. హెచ్ఆర్ఏ (హౌజ్ రెంట్ అలవెన్స్) కు సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కొత్త రూల్స్ తీసుకొచ్చింది. అది కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకే. కొన్ని కారణాలతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొన్నిసార్లు హెచ్ఆర్ఏకు అర్హత ఉండదంటూ చెప్పుకొచ్చింది. అయితే.. అది కొన్ని అనివార్య కారణాలని.. ఆ కారణాల చేత హెచ్ఆర్ఏకు
ఉద్యోగికి అర్హత ఉండదని చెప్పింది.అందులో ఒకటి కేంద్ర ప్రభుత్వ ఇచ్చిన క్వార్టర్స్ ను మరో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి ఇచ్చినా, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి క్వార్టర్ ను ఆ ఉద్యోగి పేరెంట్స్, కొడుకు, కూతురుకు ఇచ్చినా హెచ్ఆర్ఏకు ఆ ఉద్యోగి అర్హత కోల్పోతారు. ప్రభుత్వ ఉద్యోగి భార్య కానీ భర్త కానీ.. వాళ్లకు ఒక రెసిడెన్స్ ఇస్తే.. ఉద్యోగికి ఇంతకుముందే మరో రెసిడెన్స్ అలోట్ చేసి ఉంటే.. అప్పుడు హెచ్ఆర్ఏ అర్హతను కోల్పోతారు.
7th Pay Commission : రెంట్ హౌస్ లో ఉండే ఉద్యోగులకే హెచ్ఆర్ఏ
ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే రెంట్ హౌస్ లో ఉంటారో. వాళ్లకే కొన్ని క్యాటగిరీల ద్వారా వసతి కల్పిస్తారు. మొదటి కేటగిరీ వాళ్లలో 50 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న ఏరియాల్లో ఏడో వేతన సంఘం సిఫారసుల మేరకు 24 శాతం హెచ్ఆర్ఏను అందించనున్నారు. వై కేటగిరీ కింద 5 లక్షల నుంచి 50 లక్షల మధ్య జనాభా ఉన్న ప్రాంతాల్లో అయితే 16 శాతం హెచ్ఆర్ఏను అందిస్తారు. జెడ్ కేటగిరీ కింద 5 లక్షల కంటే తక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో 8 శాతం హెచ్ఆర్ఏను అందిస్తారు.